Read News in Telugu Language
adsdaksha

28 మంది ఐపీఎస్ ల బదిలీ.. పలువురికి ఎస్పీలుగా పోస్టింగ్ లు..

దక్ష న్యూస్, హైదరాబాద్ : జూన్ 17

ఇటీవలే ఐఏఎస్ లను బదిలీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఐపీఎస్ లను బదిలీ చేసింది. 28 మందికి స్థానచలనం కలిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఎస్పీగా విశ్వజిత్ కంపాటి, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే, ఏసీబీ జేడీగా రితిరాజ్ లను నియమించారు. డీజేపీ కార్యాలయంలో రిపోర్టు చేయలని కొందరికి ఆదేశాలు జారీ చేశారు.

Hospital

Read also: కూసుమంచి మండలంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన..

జగిత్యాల ఎస్పీగా అశోక్ కుమార్, సూర్యాపేట ఎస్పీగా సన్ ప్రీత్ సింగ్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్దే, జోగులాంబ గద్వాల ఎస్పీగా టి. శ్రీనివాసరావు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా రుతురాజ్, సీఐడీ ఎస్పీగా విశ్వజిత్ కంపాటి, కుమురంభీం అసిఫాబాద్ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు, బాలానగర్ డీసీపీగా కె. సురేశ్ కుమార్, మహబూబ్ నగర్ ఎస్పీగా జానకి ధరావత్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్ధన్, శంషాబాద్ డీసీపీగా బి. రాజేష్, మేడ్చల్ జోన్ డీసీపీగా ఎన్.కోటిరెడ్డి, వికారాబాద్ ఎస్సీగా కె. నారాయణరెడ్డి, నల్గొండ ఎస్పీగా శరత్ చంద్రపవార్, సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా చందనా దీప్తి, వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా షేక్ సలీమా, యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా సాయి చైతన్య,
హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా సాదన రక్ష్మి పెరుమాళ్, డిచ్ పల్లి ఏడో బెటాలియన్ కమాండెంట్ గా రోహిణి ప్రియదర్శిని, మంచిర్యాల డీసీపీగా ఎ. భాస్కర్, జనగామ వెస్ట్ జోన్ డీసీపీగా బి.మహేంద్ర నాయక్, టీజీఎస్సీ రెండో బెటాలియన్ (యాపలగూడ ఆదిలాబాద్) కమాండెంట్ గా నితికా పంత్ బదిలీ అయ్యారు.

Leave A Reply

Your email address will not be published.