Read News in Telugu Language
adsdaksha

గాజా నగరంపై భూతల దాడులు ..ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 266 మంది మృతి..

దక్ష న్యూస్, హైదరాబాద్: అక్టోబర్ 23

హమాస్ (hamas ) ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటున్న ఇజ్రాయెల్ ( israel ).. గాజా ( gaja ) నగరంపై భూతల దాడులు చేస్తూనే ఉంది. రాత్రి సమయంలో పరిమిత స్థాయిలో ఈ దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. తమదేశంపై దాడి చేసేందుకు హమాస్ సమావేశమైన స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ఇందులో సాయుధ, పదాతిదళాలు పాల్గొన్నట్లు చెప్పింది. ‘తదుపరి దశ యుద్ధానికి సిద్ధమయ్యే మిలిటెంట్లను హతమార్చడమే ఈ దాడుల ఉద్దేశం’ అని ఇజ్రాయెల్ మిలిటరీ ( israel defense forces ) ప్రతినిధి రేర్ అడ్మిరల్ డానియల్ హగారీ ( rear admiral daniel hagari ) చెప్పారు. అలాగే హమాస్ చేతిలో బందీలుగా మారిపోయిన వారిని గుర్తించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. గత 24 గంటల్లో గాజాలోని 320 లక్ష్యాలపై దాడి చేసినట్లు ప్రకటించారు.

Hospital

read alsso : రెండు రైళ్లు ఢీ.. బంగ్లాదేశ్ లో ఘోర రైలు ప్రమాదం..

ఈ దాడులపై హమాస్ నుంచి కూడా ప్రకటన వెలువడింది. ఇజ్రాయెల్ దళానికి చెందిన సామాగ్రిని తాము ధ్వంసం చేసినట్లు తెలిపింది. అలాగే ఆ బలగాలు వెనక్కివెళ్లేలా ఒత్తిడి తీసుకువచ్చినట్లు పేర్కొంది. ఇప్పటికీ లక్షల మంది సామాన్యపౌరులు గాజాలోని ఉత్తర ప్రాంతంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా దక్షిణ ప్రాంతానికి తరలివెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ జరిపిన రెండు వారాల బాంబు దాడిలో దాదాపు 4,600 మంది మరణించారని గాజాలోని ఆరోగ్య అధికారులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.