Read News in Telugu Language
adsdaksha

భక్తికి మతం అడ్డుకాదని నిరూపించిన ముస్లిం యువకుడు..

దక్ష న్యూస్, ఆధ్యాత్మికం.

అభిమాన నాయకుడి కి అద్భుత బహుమానం ..

అభివృద్ధిని కలగలిపి వినాయక చవితి వృత కల్పం ..

అభిమాన నేత చేసిన అభివృద్ధిని వినాయక వ్రతకల్పం తో ఇంటింటికి చేర్చి అచెంచలమైన భక్తిని చాటుున్నాడో ముస్లిం యువకుడు. గంగా,జమునా, తాహజీబ్ కు నిలువెత్తు నిదర్శనం గా వినాయక చవితి రోజున ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అతడి ప్రయత్నం. వివరాల్లో కెళితే..

Hospital

నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జూరుకు చెందిన యస్.కె.మాజిద్  ( sk Majid ) 2001 లో టి ఆర్ యస్ ( trs) ఆవిర్భావం నుండి మంత్రి జగదీష్ రెడ్డికి అనుంగు అనుచరుడిగా ఉన్నాడు. ఉద్యమ సమయంలో అధినేత జగదీష్ రెడ్డి ( jagadeesh reddy ) చేపట్టిన ప్రతి కార్యక్రమంలో ముందుండడం ఆనవాయితీగా మారింది. ఆయనే కాదు వాళ్ళ కుటుంబం యావత్ గులాబీ బాటలో నడుస్తోంది. ఆయన సోదరుల్లో ఒకరు యస్ కె మోయిజ్ ఆ గ్రామానికి ప్రస్తుతం సర్పంచ్ గా ఉన్నారు. మిగితా ఇద్దరు సోదరులు ఎలక్ట్రికల్ విభాగంలో కాంట్రాక్టర్లు గా స్థిర పడ్డారు. ఈ క్రమంలో అభిమాన నేత మంత్రి జగదీష్ రెడ్డి కొరకు వినూత్నమైన పద్ధతిలో తనకు చేతనైన తోడ్పాటు అందించాలనుకున్నారు. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన సూర్యపేట పట్టణంలో జరిగిన అభివృద్ధిని ఇంటింటికి చేర్చాలని నిర్ణయించారు. అందుకు అనువైన మార్గం హిందువులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వినాయక చవితి ని ఎంచుకున్నారు. దాంతో వినాయక చవితి రోజున హిందువులందరికి చేరే విధంగా పట్టణాభివృద్ధి ప్రతిబింబింప చేయడంతో పాటు వినాయక చవితి వ్రత కల్ప విధానం పుస్తకాన్ని అందజేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా అందరికీ కలకాలం గుర్తుండి పోయేలా వినాయక వ్రత కల్పం పుస్తకాన్ని రూపొందించారు. పండుగ రోజు మట్టి గణపతిని, దాంతో ఈ పుస్తకాన్ని అందజేశారు. ఈ పుస్తకాన్ని చూసిన మంత్రి జగదీష్ రెడ్డి, సునీతా జగదీష్ రెడ్డి దంపతులు మంత్ర ముగ్దులయ్యారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి సంవత్సరం భక్తులకు మట్టి వినాయకుడి ప్రతిమలను అందించడమే కాకుండా ఈ సంవత్సరం వినూత్న కార్యక్రమం నిర్వహించిన ముస్లీం యువకుడిని అభినందించారు.

Read also: ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు..

Leave A Reply

Your email address will not be published.