Read News in Telugu Language
adsdaksha

కేసీఆర్ కు హరీశ్ వెన్నుపోటు ఖాయం .. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 25 మంది టచ్ లో ఉన్నారు: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ..

దక్ష న్యూస్, హైదరాబాద్: పిబ్రవరి 9

మాజీ సీఎం కేసీఆర్‌కు ఆయన అల్లుడు హరీశ్‌రావు ఎప్పుడైనా వెన్నుపోటు పోడవడం ఖాయం అని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ( jaggareddy ) జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ( brs ) ఎమ్మెల్యేలు 25 మంది కాంగ్రెస్ ( congress ) కు టచ్ లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజాపాలనతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తున్నదని అన్నారు. బీఆర్ఎస్ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతున్నదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి చూసి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆలోచనలో పడ్డారని, త్వరలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు భారీ స్థాయిలో హస్తం గూటికి చేరబోతున్నారని అన్నారు.

Hospital

read also : కాంగ్రెస్ లో చేరిన బాబా ఫసియుద్దీన్ .. దీపాదాస్ మున్షి సమక్షంలో చేరిన మాజీ డిప్యూటీ మేయర్..

ఈ విషయాన్ని తాను కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాని జగ్గారెడ్డి అన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా తమ పార్టీలోకి రావొచ్చని అన్నారు. తాను మెదక్ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని జగ్గారెడ్డి తెలిపారు. ఒక వేళ రేవంత్‌రెడ్డి ఆదేశిస్తే పోటీ చేస్తానని అన్నారు. గతంలో పోలీసులను అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ నేతలు తమను గడ్డపారతో పొడిచినంత పని చేశారని ఆరోపించారు. తొమ్మిదేళ్లలో ఆ పార్టీ తమను ఎన్నో ఇబ్బందలకు గురి చేసిందని అన్నారు. జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై పొలిటికిల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చ నడుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.