Read News in Telugu Language
adsdaksha

బీఆర్ఎస్ పార్టీకి జలగం జలక్..

దక్షన్యూస్, ఖమ్మం: అక్టోబర్ 31

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ( brs party ) కి జలగం జలక్ ఇచ్చారు. ఆ పార్టీకి సీనియర్ నేత, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ( jalagam venkatarao ) మంగళవారం రాజీనామా చేశారు. బుధవారం ఏఐసీసీ ( aicc ) అగ్ర నేత రాహుల్ గాంధీ ( rahul gandhi ) సమక్షంలో కాంగ్రెస్ ( congress ) పార్టీలో చేరనున్నారు. టీపీసీసీ ( tpcc ) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ ( clp ) నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో జలగం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

read also : అన్నమీద ప్రేమతో తమ్ముడిని భుజంపై ఎత్తుకొన్న కాంగ్రెస్ శ్రేణులు..

గత కొంతకాలంగా జలగం పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీఎం కేసీఆర్‌ని కలవడానికి పలుమార్లు అపాయింట్‌మెంట్ అడిగినా పట్టించుకోకపోవడంతో పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. దీనికితోడు కొద్దిరోజుల క్రితం ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో కూడా సీఎం కేసీఆర్ తనకు హ్యాండ్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.

Hospital

పార్టీ టికెట్ ఇస్తుందని ఆశలు పెట్టుకున్న తనను పట్టించుకోకపోవడంతో తన అనుచరులతో సమావేశం అయి కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు కూడా తనను సంప్రదించడంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ అయితేనే కరెక్ట్ అని హస్తం పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.

read alsso : ప్రసాద్ రెడ్డి సమక్షంలో జెడ్పీటీసీ బెల్లం శ్రీను పుట్టినరోజు వేడుక ..

జలగం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన అనుచరులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జలగం కాంగ్రెస్ పార్టీలో చేరితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హస్తం పార్టీ బలం మరింత బలపడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటికే కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ పెండిగ్‌లో ఉండడంతో జలగం వెంకట్రావుకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ముమ్మర ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కారు పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

Leave A Reply

Your email address will not be published.