Read News in Telugu Language
adsdaksha

బీజేపీ ఎంపీగా జయప్రద పోటీ.. ఎన్నికల నియమావళి కింద కేసులు ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 13

సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదను వెంటనే అరెస్టు చేయాలని ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో యూపీ ( up ) లోని రాంపూర్ ( rampur ) నుంచి బీజేపీ ఎంపీ ( bjp mp ) అభ్యర్థిగా జయప్రద ( jayaprada ) పోటీ చేశారు. అప్పుడు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులకు సంబంధించి విచారణ చేస్తున్న ప్రజాప్రతినిధుల కోర్టు.. కోర్టులో హాజరు కావాలంటూ ఆమెకు ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో, గతంలో ఒకసారి ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను సైతం జారీ చేయాలని కోర్టు ఆదేశించింది.

Hospital

read also : అధ్యక్షా.. రెండ్రోజులు సెలవు ఇయ్యుర్రి.. అసెంబ్లీలో ఎమ్మెల్యే మల్లారెడ్డి ..

ఇప్పటి వరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా.. పోలీసులు జయప్రదను అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఈ క్రమంలోనే ఆమెను వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని రాంపూర్ ఎస్పీని కోర్టు ఆదేశించింది. తదిపరి విచారణను ఫిబ్రవరి 27కి వాయిదా పడింది.

Leave A Reply

Your email address will not be published.