Read News in Telugu Language
adsdaksha

ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ రీతు వర్మ..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 7

జెసి మాల్ ప్రారంభోత్సవానికి జన నీరాజనం..

జెసి మాల్ ఫ్యాషన్ ఫర్ ఆల్ (jc mall fashion for all ) ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖ సినీ నటి రీతు వర్మ ( reetu varma ) ఖమ్మంలో సందడి చేశారు. ఖమ్మం ( khammam ) వాసులతో ముచ్చటించడమే కాదు సెల్పీలు దిగారు. స్టెప్పులేసి మరీ అభిమానుల్లో జోష్ పెంచారు. శనివారం ఖమ్మం నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మించిన జెసి మాల్ ఫ్యాషన్ ఫర్ ఆల్ ను ప్రారంభించేందుకు రీతు వర్మ ఖమ్మం వచ్చారు. తమ అభిమాన తార విచ్చేయడంతో ఆమెను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు.
రీతు వర్మను స్వయంగా కలుసుకునే అవకాశం రావడంతో ఆమెతో సెల్ఫీలు దిగి సంబర పడ్డారు.

read also : ప్రంపంచ స్థాయిలో నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్ ను తీర్చిదిద్దుతాం..

ఖమ్మంలో అధునాతన అంగులతో రూపుదిద్దుకున్న జెసి మాల్ నూతన వస్త్రాలయం వస్త్ర ప్రియులకు కనువిందు చేసింది. అధునాతన డిజైన్లు, సరికొత్త వెరైటీలతో ప్రత్యేకంగా రూపొందించిన వస్త్ర సోయగం కొనుగోలు దారులను మంత్ర ముగ్ధులను చేసింది. దానికి తోడు ప్రారంభోత్సవ ప్రత్యేక ఆఫర్ లు తోడవడంతో ప్రారంభోత్సవానికి వచ్చిన ఖమ్మం, పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా షాపింగ్ చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా జేసి మాల్ లో ఏర్పాటు చేసిన సిల్వర్ జ్యుయలరీ షోరూమ్ లను ప్రముఖ సినీ తార రీతు వర్మ అట్టహాసంగా ప్రారంభించారు.

Hospital

ఆమె రాకతో ఖమ్మం ఇల్లందు క్రాస్ రోడ్డు ప్రాంతం జన సందోహంగా మారింది.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నాణ్యమైన, నమ్మకమైన, వస్త్రాలు, వెండి అభరణాలు అతి తక్కువ ధరలలో ప్రజలకు అందుబాటులో ఉంచడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా సంతోషంగా ఉండాలని , అన్ని పండగలు నూతన వస్త్రాలతో హ్యాపీగా జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు.

read also : తెలంగాణలో తొలి రోప్ వే… పనులకు మంత్రి శంకుస్థాపన..

అనేక దశాబ్దాలుగా జెసి మాల్ సరసమైన ధరలకు సరికొత్త డిజైన్లతో రూపొందించిన వస్త్రాలను, వెండి అభరణాలను అందుబాటులో ఉంచడం గొప్ప విషయమని ఈ సందర్భంగా రీతు వర్మ అభిప్రాయపడ్డారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు చుట్టుపక్కలకు చెందిన పలు జిల్లాల ప్రజలు ఆదరించాలని కోరారు.

ఈ సందర్భంగా దిగు దిగు.. దిగు దిగు ..దిగు నాగో.! ఓ నాగో..!! దివ్య సుందరి నాగో అనే పాటకు రీతు వర్మ యాంకర్ బిగ్ బాస్ షో ఫ్రేమ్ కాజల్ తో కలిసి స్టెప్పులు వేసి ప్రేక్షకులకు కనువిందు చేశారు. అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగారు. నవ్వుతూ ఆడి,పాడి అభిమానులకు రెట్టింపు ఉత్సాహాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో జెసి మాల్ నిర్వహకులు కృష్ణారావు, వెంకటరెడ్డి, మర్రి జమున రెడ్డి, మర్రి మధుమతి రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.