Read News in Telugu Language
adsdaksha

7న ఖమ్మంలో జెసి మాల్ ప్రారంభం..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 6

సందడి చేయనున్న ప్రముఖ హీరోయిన్ రీతు వర్మ..

ఖమ్మం ( khammam ) నగరంలో శనివారం జెసి మాల్ ( jc mall ) ప్రారంభం సందర్భంగా ప్రముఖ హీరోయిన్ రీతు వర్మ ( reetu varma ) ముఖ్యఅతిథిగా హాజరై సందడి చేయనున్నారు. ఖమ్మం నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో అధునాతన హంగులతో నిర్మించిన నూతన జెసి మాల్ ను ప్రముఖ హీరోయిన్ రీతు వర్మ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

Hospital

read also : ప్రంపంచ స్థాయిలో నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్ ను తీర్చిదిద్దుతాం..

ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లు కృష్ణా రావు , వెంకటరెడ్డి లు మాట్లాడుతూ, జెసి మాల్ ఫ్యాషన్ ఫర్ ఆల్ ప్రారంభం సందర్భంగా ఖమ్మంలో మునుపెన్నడు చూడని వెరైటీ డిజైన్లతో, అదిరిపోయే వస్త్రాలు ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్ ఆకట్టుకునే విధంగా రూపొందించిన వెరైటీ వస్త్రాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకోసం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఉదయం 10.30 గం. ప్రారంభమయ్యే ప్రారంభోత్సవ వేడుకలో సినీ హీరోయిన్ రీతు వర్మతో పాటూ పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. స్పెషల్ ప్రారంభ ఆఫర్ లతో ఆధునిక డిజైన్లతో కొలువుదీరిన జెసి మాల్ ఫ్యాషన్ ఫర్ ఆల్ ను ప్రజలంతా సందర్శించి ఆదరించాలని కోరారు.

 

 

Leave A Reply

Your email address will not be published.