Read News in Telugu Language
adsdaksha

జేఈఈ మెయిన్ ఫలితాలు రిలీజ్ .. సత్తాచాటిన తెలుగు స్టూడెంట్స్..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 14

జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేశాయి. జేఈఈ మెయిన్ ( jee mains ) 2024 సెషన్-1 రిజల్ట్స్ ను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) రిలీజ్ చేసింది. గత నెలాఖరులో దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో పాటు ఇతర దేశాలకు చెందిన 21 నగరాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 11.70 లక్షల మంది హాజరయ్యారు. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు తదితర 13 భాషల్లో పరీక్ష నిర్వహించారు. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో 23 మంది 100 శాతం స్కోరు (100 పర్సంటైల్‌) సాధించారు. వీరిలో తెలంగాణ నుంచి అత్యధికంగా ఏడుగురు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రల నుంచి ముగ్గురు చొప్పున ఉన్నారు.

read also : రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఎమ్మార్వో.. రైతు నుంచి పది లక్షలు లంచం డిమాండ్..

టాప్‌ 23 మందిలో అందరూ అబ్బాయిలే ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన రిషి శేఖర్‌ శుక్లా జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్సైట్లో విద్యార్థులు తమ స్కోర్ కార్డును యాక్సెస్ చేసుకోవచ్చని ఎన్టీఏ వెల్లడించింది. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి ఫలితాలు పొందొచ్చని తెలిపింది. గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రంలో పర్సంటేజ్ తో పాటు మొత్తం జేఈఈ మెయిన్ పర్సంటేజ్ కూడా తెలుసుకోవచ్చని ప్రకటించింది.

Hospital

read aalso : కానిస్టేబుల్ గా సెలక్టైన అభ్యర్థుల నిరీక్షణకు తెర .. నేడు ఎల్బీస్టేడియంలో సీఎం రేవంత్ చేతుల మీదుగా అపాయింట్మెంట్స్ ..

దేశంలోని ప్రముఖ ఐఐటీలు, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ విద్య కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష జేఈఈ. ఈ పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. మొదటిది.. జేఈఈ మెయన్స్. రెండోది జేఈఈ అడ్వాన్స్డ్. జేఈఈ మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించిన వారు.. అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధిస్తారు. అందులో కూడా అర్హత సాధించి.. మంచి ర్యాంక్ తెచ్చుకోగలిగితే ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్ పొందొచ్చు. అదేవిధంగా ఆఖరి విడత (సెషన్ 2) ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. గతంలో ఒకేసారి రెండు విడతలకు దరఖాస్తు చేసిన వారు మళ్లీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని సూచించింది. మార్చి 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉన్నట్లు తెలిపింది. అయితే ఈ చివరి విడత పూర్తయ్యాక రెండింటిలో ఎక్కువ మార్కులను పరిగణనలోకి తీసుకొని ర్యాంకును కేటాయించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.