Read News in Telugu Language
adsdaksha

హైదరాబాద్ కు జార్ఖండ్ పాలిటిక్స్.. నగరానికి చేరుకున్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 2

జార్ఖండ్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. మాజీ సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా తర్వాత అక్కడ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆయనను మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయగా 5రోజుల కస్టడీ విధించింది కోర్టు. ముఖ్యమంత్రి రిజైన్ తర్వాత అధికార జేఎంఎం కూటమి శాసనసభా పక్ష నేత చంపై సోరెన్ ను సీఎం అభ్యర్థిగా నిర్ణయించగా ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్ ను కలిశారు. కాగా అధికార జేఎంఎం కూటమి శాసనసభా పక్ష నేత చంపై సోరెన్ జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రి గా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.

Read also: కేజ్రీ మరోసారి డుమ్మా.. ఐదోసారి ఈడీ సమన్లు లెక్కచేయని ఢిల్లీ సీఎం..

Hospital

రాంచీలోని రాజ్ భవన్ లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ చంపైతో ప్రమాణం చేయించారు. చంపైతోపాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు కొత్త ప్రభుత్వం బలనిరూపణకు 10 రోజుల గడువు ఇచ్చారు గవర్నర్ రాధాకృష్ణన్.. అప్పటివరకు ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోనే బస చేయనున్నారు.

Read also: సోరెన్ కు చుక్కెదురు.. జార్ఖండ్ మాజీ సీఎం బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీం..

ఇందులో భాగంగా జార్ఖండ్ ఎమ్మెల్యేలను హైదారాబాద్ కు షిఫ్ట్ చేశారు. రెండు ప్రత్యేక విమానాల్లో శుక్రవారం సాయంత్రం బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. జార్ఖండ్ ఎమ్మెల్యేలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు, మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపదాస్ మున్షీ స్వాగతం పలికారు. జార్ఖండ్ ఎమ్మెల్యేలను బేంగపేట్ నుంచి శామీర్ పేట్ లోని రిసార్ట్స్ కు తరలించారు. శామీర్ పేట్ లోని లియోనియో హోటల్, గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో జార్ఖండ్ ఎమ్మెల్యేలకు వసతి ఏర్పాటు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్ లకు కోఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించారు.  దాంతో  జార్ఖండ్ రాజకీయ హైడ్రామాకు తెరపడినట్లైంది.

Leave A Reply

Your email address will not be published.