Read News in Telugu Language
adsdaksha

జియో ఎయిర్ ఫైబర్ ట్రిపుల్ ఇంటర్నెట్ .. 60 రోజుల పాటు ఉచితం..

దక్ష న్యూస్, సెంట్రల్ డెస్క్ : మార్చి 20

ప్రముఖ టెలికాం సంస్థ జియో ఎయిర్ ఫైబర్ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ట్రిపుల్ ఇంటర్నెట్ స్పీడ్ 60 రోజుల పాటు ఉచితంగా అందించబడుతుంది. అంటే ప్రస్తుత ప్లాన్ కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో డేటాను అందించనుంది. ఈ ఆఫర్ కొత్త వినియోగదారులకు అలాగే  ఎయిర్ ఫైబర్ ( AirFiber ) ఉన్న వినియోగదారులకు వర్తిస్తుంది.

Read also: pmegp : పీఎంఇజిపి స్కీమ్ తో యువత కలలు సాకారం..

త్వరలో ఐపీఎల్ సీజన్ ఫీవర్ ప్రారంభం కానున్న వేళ ఈ ఆఫర్ ప్రకటించడం గమనార్హం.
ఎయిర్ ఫైబర్ ప్లస్ వినియోగదారులకు ధన్ ధనా ధన్ ఆఫర్ పేరుతో జియో ఈ స్పీడ్ బూస్టర్‌ను అందిస్తోంది. మార్చి 16 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి రాగా.. బేస్ ప్లాన్ 30 ఎంబీపీఎస్ వినియోగిస్తున్నట్లయితే.. వారికి 100 ఎంబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. 100 Mbps ప్లాన్‌ని ఉపయోగిస్తే 300 Mbps, 300 Mbps ప్లాన్‌లో 500 Mbps; 500 Mbps ప్లాన్‌లో 1GB స్పీడ్ డేటా సేవలు అందుబాటులో ఉన్నాయి.

Hospital

Read also: నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది : మంత్రి తుమ్మల

కొత్త వినియోగదారులు రీఛార్జ్ చేసిన వెంటనే ఈ ప్లాన్ ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ చేయబడుతుంది. పాత వినియోగదారులు స్పీడ్ అప్ గ్రేడ్ గురించి ఇ-మెయిల్ మరియు SMS అందుకుంటారు. 6 నెలలు లేదా 12 నెలల Jio AirFiber సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. సాధారణ జియో ఫైబర్ వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తించదు.

Read also: ఎన్నికల సమయంలో ‘ఉచిత హామీలు’ వద్దు సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం ..

జియో సినిమాలో ఐపీఎల్ 2024 ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. 4K రిజల్యూషన్‌లో మ్యాచ్‌లను వీక్షించవచ్చు. డేటా సరిపోకపోతే రీఛార్జ్ చేసుకోవడానికి జియో రూ.101 మరియు రూ.251 డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లను కూడా తీసుకొచ్చింది.

Leave A Reply

Your email address will not be published.