Read News in Telugu Language
adsdaksha

కాంగ్రెస్ లో చేరిన జితేందర్ రెడ్డి .. దీపా దాస్ మున్షీ సమక్షంలో కొడుకుతో కలిసి చేరిక..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 16

లోక్ సభ ఎన్నికల ముందు తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత, మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ( jitender reddy ) బీజేపీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే కాంగ్రెస్ ( congress ) పార్టీలో చేరిపోయారు. శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( cm revanth reddy ), ఏఐసీసీ ( aicc ) ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ( deepadas munshi ) సమక్షంలో కుమారుడితో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వెంటనే జితేందర్ రెడ్డి కి కేబినెట్ ర్యాంక్ పదవి ఇస్తూ తెలంగాణ ( telangana ) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

read also : భారతంలోనే అతిపెద్ద కుంభకోణం బాండ్ల స్కీమ్ ..కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపణ ..

Hospital

న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా (క్రీడా వ్యవహారాలు) నియమించింది. బీజేపీ నుంచి మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డి భంగపడ్డారు. ఈ క్రమంలోనే గురువారం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వనించారు. దీంతో శుక్రవారం జితేందర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

read also : మల్కాజ్ గిరిలో మోడీ రోడ్ షో కి అపూర్వ స్పందన ..నేడు నాగర్ కర్నూల్ లో భారీ బహిరంగ సభ..

అయితే, మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. వంశీ చందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. దీంతో ఆయనకు కేబినేట్ ర్యాంక్ పదవి ఇచ్చి సంతృప్తి పరిచింది.

Leave A Reply

Your email address will not be published.