Read News in Telugu Language
adsdaksha

జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై కేసు.. బంజారాహిల్స్‌ పీఎస్ లో చింతా మాధవ్ ఫిర్యాదు..

దక్ష న్యూస్, హైదరాబాద్: మార్చి 24

మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్‌ నేత జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ( joginipalli santhosh kumar ) పై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లో భూకబ్జాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.. నకిలీ పత్రాలు సృష్టించి డోర్‌ నంబర్లు సృష్టించి భూమిని కబ్జా చేసేందుకు యత్నించారని బాధితులు ఆరోపిస్తున్నారు. నవయుగ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read also: ప్రధాని మోదీ భూటాన్‌ టూర్.. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం‘డ్రుక్ గ్యాల్పో’ ప్రధానం ..

Hospital

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఎన్ ఈ సి ఎల్ ( NECL ) కంపెనీకి చెందిన భూమి ఉంది. అయితే అక్రమంగా గదుల నిర్మాణం చేపట్టారని, సర్వే నంబర్ 129/54లోని 1350 చదరపు గజాల స్థలాన్ని నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించేందుకు ప్రయత్నించారని చింతా మాధవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read also: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ .. ఎన్నికల తర్వాత రేవంత్ ప్రభుత్వం కూలిపొద్ది : ఎంపీ లక్ష్మణ్..

లింగారెడ్డి శ్రీధర్‌తో పాటు సంతోష్‌రావుపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. కాగా సంతోష్ రావుపై పోలీసులు 420,468,471,447,120, ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.