Read News in Telugu Language
adsdaksha

రాం చరణ్ చేతుల మీదుగా జోగినిపల్లి పుస్తకం “వింగ్స్ ఆఫ్ పాషన్” ఆవిష్కరణ..

సంతోష్ ప్రకృతి సమతూల్యత కోసం పరితపిస్తున్నారని ప్రశంసలు..

“పక్షులతో ఉన్నప్పుడు నిశ్శబ్ధంగా ఉండమని” బుక్ లో సంతోష్ చెప్పిన మాట నా హృదయాన్ని హత్తుకుందని, జీవుల పట్ల ఎంతో కరుణ, జాలి, ప్రేమ, వాటితో నిరంతర సహవాసం ఉంటే తప్ప.. అద్భుతమైన ఆ తత్వాన్ని అర్ధం చేసుకోలేం అని సినీ హీరో రాం చరణ్  ( hero ram charan ) అన్నారు. యంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ (  joginipalli santhosh kumar ) తీసిన ఛాయాచిత్రాలతో కూడిన “వింగ్స్ ఆఫ్ పాషన్” (Wings of Passion) పుస్తకాన్ని శనివారం తన నివాసంలో జోగినిపల్లితో కలిసి రాంచరణ్ ఆవిష్కరించారు.

read also : 25న సచివాలయ గుడి,చర్చి,మసీదులకు ప్రారంభోత్సవం ..

అనంతరం రామ్ చరణ్ మాట్లాడుతూ.. రాజకీయం, ప్రజాసేవలో ఉంటూ.. కళల పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తులు అరుదుగా ఉంటారని. అలాంటి అరుదైన, మంచి మనసున్న వ్యక్తి మన రాజ్యసభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్” అన్నారు.

Hospital

పక్షులు, మూగజీవాలను అర్ధం చేసుకోవడానికి ఆయన ఎంత శ్రమించారో చెప్పడానికి ఆ ఒక్క మాట సరిపోతుందన్నారు. దేశంలో ఎందరో ఫోటోగ్రాఫర్లు ఉండొచ్చు కానీ.. రాజకీయ రంగం నుంచి వచ్చి ఇలా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ లా ఫోటోలు తీసి.. వాటిని పుస్తకంగా తీసుకొచ్చిన నేత బహుశా జోగినిపల్లి సంతోష్ కుమార్ ఒక్కరే కావచ్చని అభిప్రాయ పడ్డారు.

read aalso : సెప్టెంబర్ 2 నుండి జీహెచ్ఎంసీ పరిధి లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ..

“కళ, కళ కోసం కాదు.. ప్రజల కోసం” అన్నారు మన పెద్దలు. సంతోష్ కుమార్ తన ఫోటోల ద్వారా పక్షులు, జంతువుల, వాటి ఆవాసాలు, వాటి జీవవైవిధ్యాన్ని తన ఫోటోల ద్వారా ఆవిష్కరిస్తూ.. తన కళను ప్రదర్శించారన్నారు. తన పుస్తకం ద్వారా పక్షులు, మూగజీవాల పట్ల ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నారన్నారు. ఇది ఎంతో పరిణతితో కూడిన బాధ్యత. అంతేకాదు, పక్షులకు దూరమైన మొక్కలు నాటిస్తున్నారన్నారు. మరో పక్క వాటి పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. నిరంతరం ప్రకృతి సమతూల్యత కోసం పరితపిస్తున్నారని కొనియాడారు. నిజంగా జోగినిపల్లి సంతోష్ కుమార్ కృషికి హ్యాట్సాఫ్ అంటూ అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.