Read News in Telugu Language
adsdaksha

శెభాష్ రేవంత్..! ప్రజా ప్రభుత్వంపై కేఏ పాల్ రియాక్షన్..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 10

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలన సూపర్ గా ఉందని శెభాష్ రేవంత్ అంటూ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అభినందించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక స్థానాలు కైవసం చేసుకోవడం .. ఆ తర్వాత ఏర్పాటైన ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుందన్నారు. ఈ మేరకు శనివారం అసెంబ్లీ ఆవరణలో కేఏ పాల్ మాట్లాడారు.

Read also: సీఎం గారూ.. టైఫిస్ట్ పోస్టులు భర్తీ చేయండి.. సెక్రటేరియట్ ముందు ప్లకార్డులతో నిరుద్యోగుల నిరసన..

Hospital

సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనకు అందరూ ముగ్ధులవుతున్నారని కే. ఏ. పాల్ అన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని కొనియాడారు. రేవంత్ పర్ఫెక్ట్ లీడర్ అని ప్రశంసించారు. కేసీఆర్ కు, రేవంత్ రెడ్డికి అసలు పోలికే లేదని కొనియాడారు. కేసీఆర్ డిక్టేటర్ లా వ్యవహరిస్తే సీఎం రేవంత్ మాత్రం ప్రజల కోసమే పని చేస్తున్నారన్నారు. గడిచిన పదేళ్లు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిస్తే.. రేవంత్ తెలంగాణ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతారని నమ్మకం ఉన్నదని కేఏ పాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Read also : రాష్ట్రంలో భారీగా ట్రాన్స్ ఫర్స్ ..32 మంది డిప్యూటీ కలెక్టర్లు, 132 మంది ఎమ్మార్వోల బదిలీలు ..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు అసెంబ్లీకి వచ్చినట్లుగా కే. ఏ . పాల్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావడం కోసం తాను, సీఎం రేవంత్ రెడ్డి కలిసి విదేశీ పర్యటనకు వెళ్తామని చెప్పారు. మరోవైపు.. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు కేఏ.పాల్ పేర్కొన్నారు. అయితే కేఏ పాల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Leave A Reply

Your email address will not be published.