Read News in Telugu Language
adsdaksha

కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్…

దక్ష న్యూస్, ఖమ్మం : మే 2

పార్లమెంటు ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలనీ తద్వారా మతోన్మాద శక్తులను ప్రేరేపించే ఎన్డీఏ కూటమిని ఓడించాలని తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వి. కృష్ణారావు ( k.v. krishnarao ) అన్నారు.

Read also: 36 కులాలను బీసీల్లో చేర్చే బాధ్యత నాదే : సీఎం రేవంత్ రెడ్డి..

పెళ్లూరి విజయ్ కుమార్ అధ్యక్షన ఖమ్మంలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ సమావేశంలో కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయాలని చూస్తూ రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నం బి జె పి పార్టీ దాని మిత్ర పక్షం చేస్తున్నాయని, కనుక రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిపౌరుడిపై ఉందని అన్నారు. అందుకే లౌకిక శక్తులైన ఇండియా కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

Hospital

కాకతీయ యూనివర్సిటీలో లౌకిక కవులు కళాకారులు రచయితల సమూహంపై మతోన్మాద శక్తుల దాడులను ఖండిస్తూ,దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు గోపాగని శంఖరావు, భూక్యా రాంబాబు నాయక్, బట్టు రాజేందర్, బెల్లంకొండ నాగేశ్వరావు, ఏం. డి. వసీం, భాస్కర్ రెడ్డి, పద్మచారి, బాసాటి హనుమంతరావు, మోతీలాల్ నాయక్, గద్దె వెంకట్రామయ్య, దేవిరెడ్డి విజయ్,మహిళలు: రెడ్డిబొయిన వరలక్ష్మి, విక్టోరియా,అనంతలక్ష్మి, ధనలక్ష్మి, కృష్ణవేణి,పద్మ, స్వరూపరాణి, నిర్మల, విజయకుమరి. ఉమా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.