Read News in Telugu Language
adsdaksha

వరంగల్ బరిలో కడియం కావ్య..ప్రకటించిన అధిష్టానం..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఏప్రిల్ 2

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది. ఇప్పటికే 13 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించిన కాంగ్రెస్ ( congress) తాజాగా నిన్న మరో అభ్యర్థిని ప్రకటించింది. వరంగల్ ( warangal )  కు కడియం కావ్య ( kadiyam kavya ) పేరును ఖారారు చేసింది. సోమవారం రాత్రి ఇద్దరు అభ్యర్థులతో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.

Read also: కడియం వెళ్లాక పార్టీలో ఉత్సాహం పెరిగింది : హరీశ్ రావు

Hospital

ఆ జాబితాలో మహారాష్ట్రలోని అకోల నియోజకవర్గ అభ్యర్థిగా అభయ్ కాశీనాథ్ పాటిల్‌, తెలంగాణలోని వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్యను ఖరారు చేశారు. పార్టీలో చేరిన మరుసటి రోజునే కావ్యకు టికెట్ ఖరారు కావడం గమనార్హం.

మరోవైపు సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న నాలుగు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలపై చర్చజరిగింది. ఆయా స్థానాలకు కొందరి పేర్లను టీపీసీసీ నేతలు సిఫారస్ చేశారు. ఆ పేర్లను పరిశీలించిన అధిష్టానం.. మూడు స్థానాలను పెండింగ్ లో పెట్టి వరంగల్ స్థానానికి మాత్రం అభ్యర్థిని ప్రకటించింది. ఇదిలా ఉండగా పెండింగ్ లో ఉన్న 3 స్థానాల్లో టిక్కెట్ ఆశిస్తున్న నేతల్లో ఉత్కంట నెలకొన్నది.

అయితే త్వరలోనే ఆ ముగ్గురు అభ్యర్థలను కూడా ప్రకటించే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.