Read News in Telugu Language
adsdaksha

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్న ఈడీ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 15

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణ ఎదుర్కొంటుంన్న ఆమెను నివాసంలోనే ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ( brs mlc ) కల్వకుంట్ల కవిత ( kalvakuntla kavitha ) ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలియడంతో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దయెత్తున ఆమె నివాసం వద్దకు చేరుకున్నారు. శుక్రవారం ఈడీ, ఐటీ అధికారుల సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్ట్ నోటీసు జారీ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఈడీ అధికారులు దాదాపు 4 గంటల పాటు కవిత ఇంట్లో సోదాలు చేశారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కవితను అరెస్టు చేశారు.

Hospital

read also : రేపు పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన ..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో 8 మంది అధికారులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఏ ప్రాతిపదికన అరెస్టు చేస్తారంటూ ఈడీ అధికారులను కవిత ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కవిత నివాసం వద్దకు భారాస కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ప్రభుత్వానికి, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.