Read News in Telugu Language
adsdaksha

నాకు యాక్టింగ్ రాదు.. నేను కమల్ హాసన్ ని కాదు : కందాళ

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 30

నేను మీవాడిని.. మీ ప్రేమకు బానిసను ..

నమ్మకం ఉంటే ఓట్లేసి గెలిపించాలన్న కందాళ..

మీ అందరి దగ్గర గత ఎమ్మెల్యేల ఫోన్ నెంబర్ ఎవ్వరి దైన ఉందా.. మీ సమస్య కోసం ఎప్పుడైనా క్యాంప్ ఆఫీస్ కి వెళ్ళారా ఒక్కసారి ఆలోచించండి..లోకల్ వాళ్ళకి నాన్ లోకల్ వాళ్ళకి తేడా ఏంటో మీరే చూశారు అంటూ పాలేరు బిఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి ( kandala upender reddy ) గువ్వలగూడెం గ్రామ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

Hospital

నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామంలో కందాళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ తనకు ఘన స్వాగతం పలికిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మాయమాటలు చెప్పే వాళ్ళ మాటలు నమ్మవద్దని, వాళ్ళు ఈ ఎన్నికల అనంతరం మనకు కనపడరన్నారు. ఈ నియోజకవర్గంలో గత ఎమ్మెల్యేల అందరికంటే భిన్నంగా నేను మీ అందరితో కుటుంబ సభ్యునిగా కలసి పోయానని గుర్తు చేశారు. మళ్లీ మీ అందరికీ సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం షేక్ ముస్తాపా కి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 

అనంతరం ఆచర్లగూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. చెప్పిన మాటలు నిలబెట్టుకునే మన బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి మనస్పూర్తిగా ఆశీర్వదించాలని కోరారు. సీఎం ప్రజా ఆశీర్వద సభలో చెప్పారు పాలేరు నియోజకవర్గంలో ఉన్న దళిత సోదరులందరికీ కూడా రెండు విడతల్లో మన నియోజకవర్గం మొత్తానికి దళితబంధు ఇస్తామన్నారు. కాబట్టి మీరందరూ ఆలోచించాలన్నారు. ఇవన్నీ కచ్చితంగా అమలు జరగాలంటే కారు గుర్తుకు ఓటేసి తనను మనస్పూర్తిగా ఆశీర్వదించాలని కోరారు.

read also : డాక్టర్ శీలం పాపారావు.. మనలో ఒకరు..

ప్రతి మాటని ప్రతి పనిని చేసి చేపించే బాధ్యత నాదే అని కందాళ హామీ ఇచ్చారు. అనంతరం ఆలేరు, కోనాయిగూడెం, కోరుట్లగూడెం, అమ్మగూడెం ప్రజలతో మమేకమయ్యారు. నాకు వాళ్ళలాగా యాక్టింగ్ రాదని, తానేమి కమల్ హాసన్ కాదని అన్నారు. మీ ప్రేమకు బానిసను నేను మీ వాడిని నాపై నమ్మకం ఉంటే ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.