Read News in Telugu Language
adsdaksha

పాలేరు ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకున్నా.. బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి..!

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 25

ఏ గ్రామం వెళ్లి అడిగినా కందాలే కావాలంటారు..

అందరిలాగా వాగ్దానం చేయను .. పనులు చేసి చూపిస్తా …

పాలేరు ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకున్నానని, బీఆర్ యస్ ( brs ) ఎమ్మెల్యే అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి ( kandala upender reddy ) స్పష్టం చేశారు. పాలేరు ( paleru ) లో తనకు ప్రత్యర్థి ఎవరైనా తన గెలుపును అడ్డుకునే శక్తి ఎవరికి లేదని తేల్చి చెప్పారు. ఈనెల 27 న కూసుమంచి ( kusumanchi ) మండలంలోని జీళ్లచెరువు సమీపంలో నిర్వహించనున్న ఎన్నికల సభ ఏర్పాట్లను కందాల బీఆర్ యస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు ( tata madhu ) తో కల్సి పరిశీలించారు. ఈసందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలు నేనంటే ఏమిటో చూశారన్నారు. నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నానని, ఎవరు వచ్చి ఏది అడిగినా నాకు తోచిన సహాయం చేశా అన్నారు.

ఇది ఎవరిని అడిగినా చెపుతారని కందాల ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ను ఒప్పించి రోడ్లు తెచ్చా నని, అంతేకాదు ప్రభుత్వం కేటాయించిన గవర్నమెంట్ ఇంజినీరింగ్ కళాశాల పాలేరు నియోజకవర్గానికి సీఎం కేటాయించారన్నారు. నర్సింగ్ కళాశాల వచ్చింది..మున్నేరు ప్రాంత ప్రజలు కరుణగిరి, జలగం నగర్ ప్రాంతంలో ముంపుకు గురికాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయబోతున్నాం. పాలేరు పాత కాలువ ,భక్తరామదాసు ప్రాజెక్టుల ద్వారా సాగుతాగునీరు అందించాం. 24 గంటల ఉచిత కరంట్ ఇస్తున్నాం…రైతు బంధు , దళిత బంధు , కల్యాణ లక్ష్మి ,షాదిముబారక్ ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తున్నాం అన్నారు.

read also : పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి భాద్యత : ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ ..

విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ ,ఆరోగ్యశ్రీ ద్వారా 15 లక్షల వరకు ప్రజలు వైద్యం అందించే కార్యక్రమం పెట్టామని, సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల పెన్షన్ ఇచ్చే పథకం తేబోతున్నాం అని కందాల వివరించారు. పాలేరు నియోజకవర్గంలో గెలుపు ఖాయమని ,కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి కావడం ఎవ్వరూ ఆపలేరన్నారు.

Hospital

నేను ఇక్కడి వాడినే.. ఎక్కడినుండో రాలేదు..

తాను ఇక్కడి వాడినే అని కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. అనేకమంది ఎక్కడ నుంచో రావడం నియోజకవర్గంలో గెలవడం తరవాత పట్టించుకోకపోవడం చూస్తన్నామని.. దిగుమతి అభ్యర్థులపై ధ్వజమెత్తారు. ఒకాయన పాలేరులో పోటి కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు ..సీతారామ ప్రాజక్ట్ నీళ్లతో పాలేరు ప్రజల కాళ్ళు కడుగుతానని అన్నారు. కానీ ఏమైందో తెలియదు ప్లేట్ ఫిరాయించి ఖమ్మంకు వెళ్లారని తుమ్మలకు చురలు అంటించారు.

read also : తుమ్మల వైఖరి కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లు ఉంది : పగడాల నాగరాజు

ఈనెల 27న నిర్వహించనున్న పాలేరు నియోజకవర్గ ప్రజా ఆశీర్వాదసభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారని ఉపేందర్ రెడ్డి తెలిపారు. సభకు నియోజకవర్గపరిధిలోని ఖమ్మం రూరల్ , నేలకొండపల్లి, తిరుమలాయపాలెం , కూసుమంచి మండలాల నుంచి సుమారు 70 వేల మంది హాజరవుతారని అంచనా ఉందని కందాల అన్నారు…

తుమ్మల పై తాతా మధు విమర్శలు..

తుమ్మల అధికారులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు. ఆయనకూడా చాలాకాలం మంత్రిగా చేశారని, అధికారులు వారి విధులు వారు నిర్వహిస్తారన్నారు. పోలీసులు కేసులు పెట్టి వేధించారని చెప్పడం అభ్యంతరకరమన్నారు. అంతే కాకుండా కేసులు పెట్టిన పోలీసులను బాధితుడి ఇంటిదగ్గరకు పిలిపించి క్షమాపణ చెప్పిస్తాని చెప్పి పోలీస్ శాఖ మనోస్థయిర్యాన్ని దెబ్బతీయడం తగదని హితవు పలికారు. ఇలాంటి మాటలను ప్రజలు గమనిస్తున్నారని తగిన సమయంలో బుద్ది చెపుతారని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.