Read News in Telugu Language
adsdaksha

కదిలిన కందాళ సైన్యం..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబరు 29

పాలేరులో ప్రచారం ప్రారంభించిన ఉపేందర్ రెడ్డి..

మారెమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు..

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభతో కే సి ఆర్ ఆశీస్సులు అందుకున్న పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి ( kandala upender reddy ) ఆదివారం పాలేరు నియోజక వర్గంలో ప్రచారం ప్రారంభించారు.

ఖమ్మం రూరల్ విజయనగర్ కాలనీ నుండి బయల్దేరిన ఉపేందర్ రెడ్డి కి సతీమణి విజయమ్మ కుంకుమ దిద్ది హారతి ఇచ్చారు. కుమార్తె దీప్తి రెడ్డి ఎదురొచ్చి ఉపేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షించారు.

Hospital

అనంతరం ఉపేందర్ రెడ్డి మారెమ్మ తల్లి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వగ్రామం లోని రాజుపేట లో కందాళ తల్లిదండ్రులు నర్సింహ రెడ్డి మోహినీ దేవి.. సోదరుడు జితేందర్ రెడ్డి సమాధులకు నమస్కరించారు.

అనంతరం తన సతీమణి విజయమ్మ, కుమార్తె దీప్తి రెడ్డి కార్యకర్తలు.. నాయకులతో కలిసి మొదటిగా కందాళ కమలాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

మునిగే పల్లిలో కందాళకు ఘన స్వాగతం..

కూసుమంచి మండలం మునిగేపల్లి గ్రామంలో మొదటిగా ఎన్నికల ప్రచారం మొదలుబెట్టిన బీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి కి అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కందాళ మాట్లాడుతూ గత ఐదు ఏళ్ల నుంచి మీరందరు నన్ను చూస్తున్నారు.ఆరోజు చెప్పిన మీకు 24 గంటలు అందుబాటులో ఉంటాను అని. నేను చెప్పినట్లు కచ్చితంగా 24 గంటలు మీ అందరికీ ఫోన్లు కావచ్చుపర్సనల్ గా కావచ్చు కూసుమంచిలో ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాను అన్నారు.

ఎవరికి ఇబ్బంది వచ్చినా కచ్చితంగా మీ ఇంట్లో పెద్దదిక్కుల మీకు సేవ చేశా అని గుర్తు చేశారు. బయటి వాళ్లు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని మీకు మాయమాటలు చెప్తున్నారు. మోసపోకండి. వేరే వాళ్ళ మాటలు నమ్మ కండి. మీ బిడ్డనైన నన్ను మరొకసారి మనస్పూర్తిగా ఆశీర్వదించాలని కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.