Read News in Telugu Language
adsdaksha

గరళకంఠుడి పాత్రలో పాన్ ఇండియా స్టార్.. ప్రభాస్

దక్ష సినిమా న్యూస్ :

కన్నప్పలో ప్రభాస్ ను అలాగే చూపించండి .. ప్యాన్స్ రిక్వెస్ట్..

మంచు విష్ణు ( manchu vishnu )  ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మైథలాజికల్ మూవీ కన్నప్ప ( kannappa ). రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రస్తుతం స్విట్జర్ లాండ్ ( switzerland ) లో షూటింగ్ జరుపుకుంటుంన్న ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( prabhas ) శివుడి పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే ఆచిత్ర హీరో మంచు విష్ణు ప్రకటించేశారు. దానికి సంబంధించిన ప్రభాస్ శివుడి గెటప్ లో ఉన్న ఏఐ జనరేటెడ్ పిక్ ఒకటి ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఆ పిక్ ప్రభాస్ ప్యాన్స్ కి విపరీతంగా నచ్చేయడంతో ఏఐ పిక్ లోని ప్రభాస్ ని సినిమాలోను అలాగే చూపించాలని మంచు విష్ణుని రిక్వెస్ట్ చేస్తున్నారు. కనీసం అలాగే చూపించేందుకు ప్రయత్నించాలని అంటుంన్నారు.

Hospital

read also : నవతరానికి వరం కేసీఆర్‌ స్పోర్ట్స్‌ కిట్స్‌.. మోదీది “ఖేలో ఇండియా కాదు.. ఖతం ఇండియా”

కాగా కన్నప్ప చిత్రంలో ప్రభాస్ శివుడి పాత్రలో నటిస్తుండగా పార్వతి పాత్రలో నయనతార నటించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద కన్నప్ప పాత్ర ధారి మంచువిష్ణు కంటే, శివుడి పాత్రధారి అయిన ప్రభాస్ పైనే ప్రేక్షకులదృష్టి పడ్డట్లు టాక్. చూడాలి బోళాశంకరుడి పాత్రలో ప్రభాస్ ఎలా మెప్పిస్తారో.

Leave A Reply

Your email address will not be published.