Read News in Telugu Language
adsdaksha

మరో రైలు ప్రమాదం ..కాస్ గంజ్ లో రైలులో మంటలు..

దక్ష న్యూస్, హైదరాబాద్: నవంబర్ 23

బయటకు పరుగులు తీసిన ప్రయాణికులు

..బిల్ హౌర్ స్టేషన్ సమీపంలో ఘటన ..

Hospital

చైన్ లాగిన ట్రైన్ ఆపిన యువకుడు.. తప్పిన పెను ప్రమాదం..

కాన్పూర్ సమీపంలోని బిల్ హౌర్ రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం కాస్ గంజ్ ఎక్స్ ప్రెస్ రైలు ( kasganj express train ) అగ్నిప్రమాదానికి గురైంది. విషయాన్ని గమనించిన ఓ ప్రయాణికుడు వెంటనే చైన్ లాగి రైలును ఆపడంతో పెనుప్రమాదం తప్పింది. వివరాల్లోకెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ నుంచి అన్వర్ గంజ్ వెళుతున్న కాస్ గంజ్ రైలు.. బిల్ హౌర్ రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే.. ఓ బోగీ నుంచి మంటలు వచ్చాయి. బోగీ అంతా పొగ వచ్చేసింది. దాంతో ఓప్రయాణికుడు చైన్ లాగి రైలును ఆపడమే కాకుండా ఆ వెంటనే ఫైర్ సేఫ్టీ సిలిండర్ తో మంటలను ఆర్పేశాడు. అతను సమయస్ఫూర్తిగా వ్యవహరించటంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటన జరిగిన ప్రాంతం సుభాన్ పూర్ గ్రామానికి దగ్గరలో ఉండటం.. రైలు పట్టాల పక్కనే రోడ్డు మార్గం ఉండటంతో ప్రయాణికులు అందరూ రైలు నుంచి దూకేశారు. రోడ్డు మార్గంలో వెళ్లిపోయారు. విషయం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు ఘటన స్థలానికి వచ్చారు. ప్రమాదం చిన్నదే అని ఎవరూ గాయపడలేదని ప్రకటించారు. ప్రమాదం జరిగిన బోగీని తప్పించి.. మరో బోగీ ఏర్పాటు చేసి.. ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చుతామని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.