Read News in Telugu Language
adsdaksha

నవతరానికి వరం కేసీఆర్‌ స్పోర్ట్స్‌ కిట్స్‌.. మోదీది “ఖేలో ఇండియా కాదు.. ఖతం ఇండియా”

దక్ష న్యూస్, హైదరాబాద్: అక్టోబర్ 4

* కాంగ్రెస్‌ పాలనలో క్రీడల్లోను స్కాం లే
భారతదేశంలోనే భారీ యువజన, క్రీడాభివృద్ధి పథకంగా కేసీఆర్‌ స్పోర్ట్స్‌ కిట్స్‌ స్కీం ( kcr sports scheme ) చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని సాట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ ( dr. anjaneya gaud ) అన్నారు. రైతు బంధు, రైతు భీమా, కేసీఆర్‌ కిట్ ( kcr kit ) తదితర గొప్ప ప్రభుత్వ పథకాల వరుసలో కేసీఆర్‌ స్పోర్ట్స్‌ కిట్స్‌ కూడా యువతకు ఆసరాగా నిలిచి, వారి కలల సాకారానికి బాటలేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం వరంగల్‌ ( warangal ) జిల్లా సంగెం మండల కేంద్రంలో జరిగిన కేసీఆర్‌ స్పోర్ట్స్‌ కిట్స్‌ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ హాజరయ్యారు. పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డితో కలిసి కేసీఆర్‌ స్పోర్ట్స్‌ కిట్స్‌ను యువతకు అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆంజనేయ గౌడ్‌ మాట్లాడుతూ దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి, తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న ‘కేసీఆర్‌ స్పోర్ట్స్‌ కిట్స్‌’ రాష్ట్ర నవతరానికి గొప్ప వరమని వ్యాఖ్యానించారు.

read also : జర్నలిస్ట్ లకు తోడుగా మేము సైతం.. దద్దరిల్లిన రౌండ్ టేబుట్ సమావేశం..

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1500 కోట్లకు పైగా విలువైన స్థలాలను కేటాయించి, గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌ యువ లోకానికి దారిదీపంగా నిలిచారని అన్నారు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం… వాటి నిండా క్రీడా పరికరాలు ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌ గ్రామాల్లోని యువతలో కొత్త ఉత్సాహం కల్పించారని అన్నారు. తెలంగాణ ఆణిముత్యాలైన ఈషా సింగ్‌, నిఖత్‌ జరీన్‌ తదితర క్రీడాకారులకు కోట్ల రూపాయల నగదు బహుమతి, బంజారాహిల్స్‌లో 700 గజాల విలువైన ఇండ్ల స్థలాలను సీఎం కేసీఆర్‌ అందజేసి ప్రోత్సాహించడం వల్లనే అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్ర యువకులు పతకాలు పండిస్తున్నారని వివరించారు.

Hospital

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు దేశంలోనే భారీ క్రీడా ఈవెంట్‌లా స్పోర్ట్స్‌ అథారిటీ నిర్వహించిన సీఎం కప్‌ పోటీలలో రాష్ట్రంలోని రెండున్నర లక్షల మంది యువకులు పాల్గొని, యువ సంబురంగా జరుపుకున్నారని తెలిపారు. దాంతో పాటు ‘మహిళా ఉమెన్‌ చెస్‌ చాంపియన్‌ షిప్‌, ట్రై క్రీడా వేడుకలు, చలో మైదాన్‌’ తదితర భారీ క్రీడా ఈవెంట్‌లలో వేలాదిమంది యువకులు భాగస్వామ్యులయ్యారని వివరించారు. ఇటీవల చేపట్టిన చలో మైదాన్‌లోనే రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది యువకులు పాల్గొన్నారని అన్నారు. గత పదేళ్లలో లక్షా యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు ఐటీ, ప్రయివేట్‌రంగంలో 85 వేల పరిశ్రమల ఏర్పాటుకు సహకరించి, ప్రయివేట్‌రంగంలో దాదాపు 16 లక్షల ఉద్యోగాలు యువతరానికి లభ్యమయ్యేలా సీఎం కేసీఆర్‌ దారులేసారని అన్నారు.

read also : సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరం :మణుగూరు సిఐ రమాకాంత్ ..

కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాల హయాంలో క్రీడల్లోనూ స్కాం లేనని, 2010 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లోనూ దాదాపు రూ.70 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. మోదీ సర్కార్‌ ‘‘ఖేలో ఇండియా నినాదమిస్తూ ఖతం ఇండియా’’ కార్యక్రమాన్ని అమలుపరుస్తున్నదని దుయ్యబట్టారు. 60 కోట్లకు పైగా ఉన్న యువతకు ఖేలో ఇండియా పేరుతో కేవలం 45 లక్షల కోట్ల దేశ బడ్జెట్‌లో కేవలం వెయ్యి కోట్ల నిధులే కేటాయించడం దారుణమని, వాటిలోనూ దాదాపు 600 కోట్ల నిధులు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఖర్చు చేశారని విమర్శించారు. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ 450కి పైగా సంక్షేమ పథకాలను అమలు చేశారని వివరించారు.

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గాలి మాటలు చెప్పే కాంగ్రెస్‌, బిజెపి పార్టీలను నమ్మొద్దని, ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్‌ సర్కార్‌నే బలపరచాలని కోరారు. కరెంట్‌ బాధలను దూరం చేయడంతో పాటు రైతు, మహిళా లోకానికి సీఎం కేసీఆర్‌ ఎంతో మేలు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ను ఎమ్మెల్యే ఇతర ప్రజాప్రతినిధులు గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి, జెడ్పీటీసీ, సర్పంచ్‌లు, అధికారులు, యువత, మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.