Read News in Telugu Language
adsdaksha

ఖమ్మం గడ్డపై నీలి జెండా ఎగరేస్తాం ..

దక్ష న్యూస్, ఖమ్మం సెప్టెంబర్ 22

బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యర్రా కామేష్..

రానున్న ఎన్నికల్లో ఖమ్మం ( khammam ) గడ్డమీద నీలిజెండాను ఎగరవేసి తీరుతామని బీఎస్పీ ( bsp ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యర్రా కామేష్ ( yarra kamesh ) స్పష్టం చేశారు. శుక్రవారం అంబేడ్కర్ భవన్ లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బుర్ర ఉపేందర్ సహు అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కామేష్ మాట్లాడుతూ.. 90 శాతానికి పైగా ఉన్న బీసి, దళిత, గిరిజన, మైనార్టీ, బహుజన వర్గాలను కాదని ఖమ్మం నియోజకవర్గంలో 2004 నుండి అగ్రవర్ణాల పెత్తనం కొనసాగుతుందని, అగ్రవర్ణాల వారే ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారని,ఈ సాంప్రదాయానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని అన్నారు. బహుజనులు కేవలం జెండాలు మోసేందుకే ఉన్నారని అగ్రవర్ణ ఆధిపత్య పార్టీల అహంభావాన్ని ఖమ్మం గెలుపుతో చెరుపివేయాలని పిలుపునిచ్చారు.

Hospital

read also : సాదు కుంటరో.. సంపుకుంటరో మీ ఇష్టం .. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ప్రకటించాక ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావడం ప్రారంభించిందన్నారు. ఒక్కొక్కరు వందల కుటుంబాలను బతికించేలా చేయడమే బీఎస్పి సిద్ధాంతమని అన్నారు. బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాల అధిపత్యాన్ని ఇకమీదట కొనసాగనివ్వమని అన్నారు. బహుజనులకు కావాల్సింది దళితబంధు, బీసీబంధు, మైనార్టీబందు, గిరిజనబందులు, బర్రెలు, గొర్రెలు, చేపలు కాదని రాజ్యాధికారంలో వాట కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మేకతొట్టి పుల్లయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రమోహన్, ట్రెజరర్ సుభాని, జిల్లా మహిళా కన్వీనర్ బానోత్ రజిని, జిల్లా కార్యదర్శులు శీలం వెంకటేశ్వరావు, వైరా నియోజకవర్గ ఇంచార్జి బానోత్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.