Read News in Telugu Language
adsdaksha

శ్రీనగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు..

దక్ష న్యూస్, ఖమ్మం: జనవరి 13

ఖమ్మం నగరంలో శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 6 శ్రీనగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలాజీ ఎస్టేట్స్ & కన్స్ట్రక్షన్స్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ వత్సవాయి రవి, రెజోనెన్స్ విద్యాసంస్థల డైరెక్టర్ కొండా శ్రీధర్ రావు లు పాల్గొని పోటీల్లో గెలుపొందిన వారికి ప్రధమ , ధృతీయ , తృతీయ బహుమతులు అందజేశారు. పాల్గొన్న ప్రతి ఒక్క మహిళలకు కన్సోలేషన్ బహుమతులు అందజేశారు.

Hospital

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు పి.మల్లయ్య , గౌరవ అధ్యక్షులు పి వెంకటేశ్వర్లు , కోటేశ్వరరావు , స్వరూప రాణి , ఆనంద రెడ్డి , నాగిరెడ్డి , రామకృష్ణ , కృష్ణకుమారి , కృష్ణప్రియ , విజయలక్ష్మి కాలనీ వాసులు పాల్గొన్నారు.

read also : సంక్రాంతి ముగ్గుల్లో సత్తా చాటిన సత్తుపల్లి యువకులు..

Leave A Reply

Your email address will not be published.