Read News in Telugu Language
adsdaksha

ఎయిర్ పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..

దక్ష న్యూస్, హైదరాబాద్ : పిబ్రవరి 7

ఎయిర్ పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కొత్త స్టేషన్ మొదటి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను, ప్లాట్ ఫామ్ 1లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ నిర్మాణ పనులను కిషన్ రెడ్డి బుధవారం పరిశీలించారు. రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు.

Read also: అసెంబ్లీలో తిట్టుకోవద్దు.. పరేడ్ గ్రౌండ్స్ వెళ్లండి: బండి సంజయ్..

Hospital

స్టేషన్ ఆధునీకరణ పనులపై రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్, ఉన్నతాధికారులతో కలిసి కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ గతేడాది ఈ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. మొత్తం మూడు దశల్లో పనులు జరుగుతాయని అన్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కచ్చితంగా అమలు చేస్తారని చెప్పారు.

Read also: బీజేపీకి బిగ్ షాక్.. ఆ పార్టీకి బాబు మోహన్ రాజీనామా..

అత్యాధునిక సౌకర్యాల కల్పనే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. 2025 నవంబర్ కల్లా పనులు మొత్తం పూర్తవుతాయని మోడీ చేతుల మీదుగానే రైల్వే స్టేషన్ ను జాతికి అంకింతం చేస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. నాంపల్లి, కాచిగూడ స్టేషన్ ల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించాం అన్నారు. కొమురవెల్లి మల్లన్న దర్శనం కోసం కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణానికి ఫిబ్రవరిలో ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. చర్లపల్లి టెర్మినల్ పనులు కూడా తొందరలోనే కంప్లీట్ అవుతాయని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.