Read News in Telugu Language
adsdaksha

తెలంగాణ పరువు తీసినవ్ : ఎమ్మెల్సీ కవితపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 26

ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణలో కవిత కీలక పాత్ర పోషించారని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఊడు కిషన్ రెడ్డి ( kishanreddy ) విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆప్ ప్రభుత్వంతో కవిత చర్చలు జరపలేదా? అని ప్రశ్నించారు. మద్యం కేసులో కవిత ( kavitha ) పాత్ర లేకపోతే కేసీఆర్ ( kcr ) బహిరంగ చర్చకు రావాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి తానేం ఏం చేశానో ప్రజలకు తెలుసునని అన్నారు. బీఆర్ఎస్ ( brs ) హయాంలో రాష్ట్రం ఎంత దోపిడికి గురైందో చూస్తేనే అర్థమవుతుందన్నారు.

Hospital

read also : 14సీట్లు పక్కా రావాలి : కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి..

కల్వకుంట్ల తారక రామారావు అడ్డగోలు మాటలు కాదు.. దమ్ముంటే చర్చకు రావాలని సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయనే బాధ్యత వహించాలన్నారు. కేసీఆర్ పై కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. బీజేపీ కార్యాలయ సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌కు అప్పటి సీఎం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

Leave A Reply

Your email address will not be published.