Read News in Telugu Language
adsdaksha

ముందు ముక్కు నేలరాయి.. కేసీఆర్ ఆ తర్వాతే నల్గొండకు రా : మంత్రి కోమటిరెడ్డి..

దక్ష న్యూస్, నల్గొండ : ఫిబ్రవరి 11

ఎస్ఎల్‌బీసీని దగ్గరుండి పూర్తిచేస్తానని జిల్లా వాసులను మోసం చేసిన మాజీ సీఎం కేసీఆర్ నల్గొండకు వచ్చే అర్హత లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( komatireddy venkatareddy ) విమర్శించారు. ఉమ్మడి నల్గొండ ( nalgonda ) జిల్లాకు బీఆర్ఎస్ ( brs ) ప్రభుత్వం చేసిందేమి లేదని దుయ్యబట్టారు. ఆదివారం నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎస్ఎల్‌బీసీని కుర్చీ వేసుకొని పూర్తి చేసి ఈ జిల్లాను సస్యశ్యామలం చేస్తానన్న కేసీఆర్ ( kcr ) మాట తప్పాడన్నారు. కేసీఆర్ ముక్కు నేలకు రాసిన తర్వాత నల్గొండకు రావాలన్నారు.

Read also: ఢిల్లీలో హై అలర్ట్.. ఆందోళనకు అన్నదాతల పిలుపు..

Hospital

నల్గొండ జిల్లాను బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వ నాశనం చేసిందని కోమటిరెడ్డి మండిపడ్డారు. సభ రోజు నల్గొండలో ప్రజలకు క్షమాపణ చెప్పాకే కేసీఆర్ ప్రసంగించాలని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ మాట తప్పడంపై నల్గొండ టౌన్‌లో సభ రోజు వినూత్న నిరసన చేస్తామని వెల్లడించారు. కేసీఆర్ కోసం చైర్, పింక్ టవల్ ఎల్ఈడి స్క్రిన్ పోలీసు పర్మిషన్‌తో పెడతామని వెంకట్ రెడ్డి చెప్పారు. కేఆర్ఎంబీ ఫైళ్లపై సంతకం పెట్టిందే కేసీఆర్, హరీష్ రావు అని అన్నారు.

Read also: గుట్టపైకి ఆటోలకు ఎంట్రీ.. ప్రారంభించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య..

బీఆర్ఎస్ అప్పులకు కూడా బడ్జెట్ కేటాయించామని వెంకటరెడ్డి అన్నారు. కాళేశ్వరం మేడిగడ్డపై చర్చ వేదికలో అందరూ పాల్గొనాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర బడ్జెట్ ప్రజాపయోగ్యమైందన్నారు దాని గురించి ఎవరైనా విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు.

Leave A Reply

Your email address will not be published.