Read News in Telugu Language
adsdaksha

కేసీఆర్ చేసిన పాపాలు ఆయనకే తగిలాయి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

దక్ష న్యూస్, హైదరాబాద్: మార్చి 29

సీఎంగా ఉండగా కేసీఆర్ చేసిన పాపాలు ఆయనకే చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( komatireddy venkatareddy ) వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ ( hyderabad ) లో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో ఆయన మాట్లాడారు.

యాదగిరిగుట్ట ( yadagiri gutta ) పేరు మార్చడమే కేసీఆర్ ( kcr ) చేసిన మొదటి తప్పని వెంకట రెడ్డి అన్నారు. అందులో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఎన్నికల అనంతరం విచారణ చేపడతామన్నారు.

Hospital

యాదాద్రి ( Yadadri ) పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మారుద్దాం అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. అతని పాపాల వల్ల కరువు వచ్చిందన్నారు. వర్షం అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే వర్షం. దేవుడి పేరుతో కాళేశ్వరం ( kaleswaram ) ప్రాజెక్టు కట్టి నాశనం చేశారని మండి పడ్డారు.

గేట్లు తెరవకముందే ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లోకి చేరుతున్నారని వెంకటరెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి నల్గొండ జిల్లాను నాశనం చేశాడన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అక్కడికి వస్తారు? అధికారులతో పాపపు పనులు చేయించారు. దీంతో వారికి భయంతో నిద్ర పట్టడం లేదన్నారు.

ఫోన్ ట్యాపింగ్ ఏ రాష్ట్రంలోనూ కనిపించలేదని వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రతి విషయాన్ని రాజకీయం చేశారని కోమటిరెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని ఎద్దేవా చేశారు.

Leave A Reply

Your email address will not be published.