Read News in Telugu Language
adsdaksha

మాటల తూటాలు.. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్..

దక్ష న్యూస్, హైదరాబాద్: మార్చి 31

లోక్ సభ ఎన్నికల తరుణంలో తెలంగాణలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆ పార్టీ శాసన సభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఆక్షేపించారు. మీ అన్న మీతో టచ్‌లో ఉన్నాడో లేదో తెలుసుకోవాలని మంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వెంకట్ రెడ్డి (కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి)తో పాటు ఐదుగురు మంత్రులు బీజేపీ నాయకత్వంతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. తమ ఎమ్మెల్యేలను ఎవరైనా ముట్టుకున్నా 48 గంటల్లోనే ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యానించారు.

Hospital

Read also: రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండరాదు : సీఎం రేవంత్ రెడ్డి..

మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. “మహేశ్వర్ రెడ్డి నాపై చేసిన వ్యాఖ్యలు అసత్యం, తప్పుడు ఆరోపణలు చేయడం ఆయనకే చెల్లింది. మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ లో చేరుతానని అడిగారు. మాకే మెజార్టీ ఉంది.. అవసరం లేదని చెప్పా. పార్టీలో చేర్చుకోలేదని మనసులో పెట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రులు అమిత్, గడ్కరీ వద్దకు వెళ్లి ఏదో చెప్పానని అంటున్నారు. మహేశ్వర్ రెడ్డి కి నేను సవాల్ చేస్తున్నా. వారిద్దరిని తీసుకొనిరా.. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేద్దాం” అని ఛాలెంజ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.