Read News in Telugu Language
adsdaksha

పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో పక్షులది కీలక పాత్ర : మంత్రి కొండ సురేఖ..

దక్ష న్యూస్, హైదరాబాద్: జనవరి 5

పర్యావరణ సమతుల్యతను కాపాడు కోవడంలో పక్షులు పోషించే పాత్ర కీలకమని, అవి ఎదుర్కొనే సమస్య లను పరిష్కరించాల్సిన ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందని అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండ సురేఖ ( konda surekha ) అన్నారు.

read also : t 20 : టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్‌ను ప్రకటించిన ఐసీసీ..

Hospital

జాతీయ పక్షుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జనవరి 5వ తేదీని జాతీయ పక్షుల దినోత్సవంగా జరుపు కుంటున్నామని పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధనా సంస్థ ( eptri ) ఆధ్వర్యంలో పక్షి జాతులు ఎదుర్కొంటున్న సవాళ్లపై మంత్రి ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు.

read also : జాయ్ స్మైల్స్ ఫౌండేషన్ అంచెలంచెలుగా ఎదగాలి .. ట్రస్టు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జారె..

పక్షి జాతులు ఎదుర్కొనే సమస్య లను పరిష్కరించాల్సిన ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందని ఆ దిశగా అవగాహన పెంచడం కోసమే ఈ దినోత్సవాన్ని జరుపు తున్నామని మంత్రి అన్నా రు. దీనికి సంబంధించిన అవగాహన, విజ్ఞాన పోస్టర్‌ను పర్యావరణ పరిరక్షణ శిక్షణ , పరిశోధనా సంస్థ సిద్ధం చెయ్యడం జరిగిందన్నారు. ఆ పోస్టర్‌ను తన చేతుల మీదుగా ఆవిష్కరిం చడం చాలా సంతోషంగా వుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.