Read News in Telugu Language
adsdaksha

దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించం..

దక్ష న్యూస్, హైదరాబాద్: జనవరి 10

– ఫారెస్ట్ అధికారుల పై దాడిని తీవ్రంగా ఖండించిన మంత్రి కొండా సురేఖ.

అటవీ ప్రాంతం లో గతంలో జరిగిన దాడుల దృష్ట్యా అధికారులు ఎల్లపుడూ అప్రమత్తంగా ఉంటూ, ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న మా దృష్టికి తీసుకురావాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఫారెస్ట్ డివిజన్ రేంజ్ పరిధి లోని అటవీ ప్రాంతం నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న మాఫియా ను అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారుల పైన ట్రాక్టర్ తో చేసిన దాడి ని మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు.

Read also: 18 నుండి బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా ఈవెంట్..

Hospital

ఈ ఘటనలో దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించం అన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సంబందిత అధికారులతో మంత్రి ఫోన్ లో మాట్లాడి జరిగిన ఘటన అడిగి తెలుసుకున్నారు..

ప్రజా ప్రభుత్వం లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కొండా సురేఖ ( konda surekha) అన్నారు. జరిగిన ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించారు..

Read also: పెండింగ్ చలానాల రాయితీకి రేపే లాస్ట్ డేట్..

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని, అవసరం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి తీసుకువచ్చి ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటిని త్వరలోనే వెల్లడిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.