Read News in Telugu Language
adsdaksha

నామినేషన్ పత్రాలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు..

దక్ష న్యూస్, హైదరాబాద్: నవంబర్ 4

కోనాయపల్లి వేంకటేశ్వరుడి సన్నిధిలో సంతకాలు..

విజయ తిలకం దిద్దిన గ్రామ మహిళలు…

ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ ( cm kcr) తనకిష్టదైవమైన కోనాయపల్లి ( koonayapalli ) శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నామినేషన్ (విజయ)పత్రాలకు ప్రత్యేక పూజలు జరిపించి ఆలయ ప్రాంగణం లో సంతకాలు చేశారు.

కేసీఆర్ సెంటీ మెంట్ గా ఫీలయ్యే కోనాయపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కి ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి ధ్వజస్తంభానికి దండం పెట్టుకుని ఆలయం లోకి సీఎం ప్రవేశించారు. నామినేషన్ (విజయ) పత్రాలను ఆలయ అర్చకులకు అందించగా మూలవిరాట్టు వద్ద పత్రాలు ఉంచి సీఎం కేసీఆర్ గోత్ర నామాలు, సంకల్పంతో పూజలు నిర్వహించారు.

Hospital

 

అర్చకులు కేసీఆర్ చేతికి కంకణధారణ చేసి తీర్థ ప్రసాదాలు అందించి వేదాశీర్వచణం అందించారు. అనంతరం ఆలయ ఆవరణలోనే వేంకటేశ్వర స్వామి సన్నిధిలో నామినేషన్ పత్రాల(విజయపత్రాల)పై సీఎం కేసీఆర్ సంతకాలు చేశారు.

పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయం నుండి బయటకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి మహిళలు విజయ తిలకం దిద్దారు. కార్యకర్తలు, నాయకులు కేసీఆర్ ను చూసి హర్షధ్వానాలు చేశారు. హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ విజయం తథ్యం అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అత్యంత అభిమానంతో గులాబీల వర్షం కురిపించారు.

Read also : పెద్దాయన మతి బ్రమించినట్లు మాట్లాడుతున్నారు… ప్రజల్ని మభ్యపెట్టి గెలవాలనుకోవడం సబబు కాదు..

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రి హరీశ్ రావు, ఎంపీలు..జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బిఆర్ఎస్ నేత శ్రవణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.