Read News in Telugu Language
adsdaksha

టెట్ ధరఖాస్తు ఫీజును తక్షణమే తగ్గించాలి : తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు కొరకొప్పు రామరావు డిమాండ్..

దక్ష న్యూస్, ఖమ్మం: మార్చి 25

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వo పెంచిన టెట్ దరఖాస్తు ఫీజును తక్షణమే తగ్గించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు కొరకొప్పు రామారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఖమ్మం పట్టణంలో ఆయన మాట్లాడుతూ… గతంలో టెట్ ధరఖాస్తు ఫీజు ఒక పేపర్ కు 300 రూపాయలు, రెండు పేపర్లకు 400 రూపాయల ఫీజు ఉండేదని, దీనీతో పాటు ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఫీజులో రాయితీ ఉండేదని అన్నారు. కానీ ప్రస్తుత టెట్ నోటిఫికేషన్ లో ఒక పేపర్ కు వెయ్యి రూపాయలు, రెండు పేపర్లకు రెండువేల రూపాయలుగా పేర్కొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

Read also: సెల్‌ఫోన్‌ పేలి నలుగురు చిన్నారులు మృతి.. యూపీలో విషాద ఘటన..

టెట్ దరఖాస్తు ఫీజును దాదాపుగా ఐదు రెట్లు పెంచడం వలన టెట్ రాసే అభ్యర్థులపై పెనుభారం పడుతుందని రామారావు అన్నారు. నోటిఫికేషన్ లో ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఎలాంటి రాయితీ ఇవ్వకపోవడం కూడా ఆశ్చర్యాన్ని కలిగించిందనీ, టెట్ అనేది సంవత్సరానికి రెండు సార్లు (ఎన్.సి.టీ.ఈ నిబంధనల ప్రకారం) నిర్వహించే అర్హత పరిక్ష అన్నారు. అర్హత సాధించని అభ్యర్థులతో పాటు అర్హత సాధించిన అభ్యర్థులు కూడా ఎక్కువ మార్కులు పొందడం కోసం మరలా రాస్తుంటారని ప్రభుత్వం టెట్ పరీక్ష దరఖాస్తు ఫీజును తక్షణమే తగ్గించి గతం మాదిరిగానే నిరుద్యోగులు కట్టగలిగే దరఖాస్తు ఫీజునే నిర్ణయించాలని కోరారు.

Hospital

Read also: రాజకీయ సానుభూతి కోసమే కేజ్రీవాల్ అరెస్ట్ ను ఆహ్వానించారు.. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కీలక వ్యాఖ్యలు..

ప్రైవేట్ టీచర్స్ ఫోరం డిమాండ్ ..

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం టెట్ దరఖాస్తు ఫీజులను తగ్గించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఓ కార్యక్రమంలో డిమాండ్ చేసింది. ఈ టిపిటిఎఫ్ జిల్లా నాయకులు చౌహాన్ చౌదరి, రమేష్ సుధాకర్, కిషోర్, జబ్బర్, రమణ సరిత, వంశీకృష్ణ, శ్రీనివాస్, యాదగిరి తదితరులు డిమాండ్ చేసిన వారిలో ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.