Read News in Telugu Language
adsdaksha

దుమ్ముగూడెం విద్యార్థినికి హర్యానా గవర్నర్ ప్రశంసలు..రాజ్ భవన్ కి రావాల్సిందిగా ఆహ్వానం..

దక్ష న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఆగస్ట్ 18

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం కాటాయగూడ గ్రామానికి చెందిన కోర్సా లక్ష్మి ( korsa lakshmi )  కి హర్యానా గవర్నర్ ( Governor of Haryana ) బండారు దత్తాత్రేయ ( Bandaru Dattatraya ) ఫోన్ చేశారు. టెలిఫోన్ లో మాట్లాడుతూ శబ్బాష్ లక్ష్మి అని అభినందించారు.

కటాయగూడ గ్రామానికి చెందిన గిరిజన దంపతులైన కన్నయ్య, శాంతమ్మ దంపతుల కుమార్తె లక్ష్మి బీద కుటుంబంలో జన్మించినప్పటికీ నిరక్షరాస్యతను ఎదిరించి, ప్రతిష్టాత్మకమైన ఐఐటీ పాట్నాలో సీటు సాదించింది. దాంతో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ విశేషమైన విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించి బీహార్లోని ఐఐటీ పాట్నాలో సీటు పొందిన “కోర్సా లక్ష్మి”ని ఫోన్ చేసి అభినందించారు. అంతేకాదు లక్ష్మిని హరియాణా రాజ్ భవన్ ( Haryana Raj Bhavan ) కు వచ్చి ఆతిధ్యం స్వీకరించాలని కోరుతూ, భవిష్యత్తులో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని దత్తాత్రేయ భరోసా కల్పించారు.

లక్ష్మి తండ్రి సమీప గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ఐస్ క్రీంలు విక్రయించి, కుటుంబాన్ని పోషిస్తుంటారు. ఆమె తల్లి గృహిణి. వారికి విద్య లేకపోయినా, లక్ష్మి కి జీవితంలో రాణించడానికి అన్ని అవకాశాలను అందించాలన్న తాపత్రయంతో ఆమెను నిరాశ పరచలేదు. దాంతో భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉన్నత విద్యా సంస్థలో లక్ష్మి సీటు సంపాదించి తల్లిదండ్రుల కలలను నిజం చేసింది. ఇది ఎంతో స్పుర్తిమంతమని కొనియాడుతూ దత్తాత్రేయ లక్ష్మికి అభినందనలు తెలిపారు.

Hospital

కాగా లక్ష్మి స్థానిక గురుకులంలో 7వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యను అభ్యసించి SSC పరీక్షలలో 10/10 GPA ని సాధించింది. 2021-23 విద్యా సంవత్సరంలో, లక్ష్మి తన ఇంటర్మీడియట్ (MPC) పరీక్షలలో 1000కి 992 ర్యాంకు సాధించింది. తర్వాత భద్రాచలం ట్రైబల్ గురుకుల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో నైపుణ్యం కలిగిన బోధకుల మార్గదర్శకత్వంలో ఆమె JEE మెయిన్స్ మరియు అడ్వాన్స్డ్ కోసం అహర్నిశలు కష్టపడి చదివి ఇటీవల జరిగిన JEE అడ్వాన్స్డ్ పరీక్షలో 1371వ ర్యాంక్ సాధించి, IIT పాట్నా ( patna ) లో B Tech (EEE) ప్రోగ్రామ్లో సీటు సంపాదించి తెలుగు బిడ్డగా అందరికీ గర్వకారణమయింది.

ఈ సందర్భంగా లక్ష్మి సాధించిన విజయాలు ప్రతిచోటా యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని, సవాళ్లతో కూడిన కుటుంబ నేపథ్యంలో కూడా శ్రేష్ఠతను సాధించడానికి అవధులు లేవని రూపించిందని, తన ప్రతిభతో లక్ష్మి అందరి మనసులు గెల్చుకుందని, ఐఐటీ పరీక్షల్లో ఆమె అసాధారణ ప్రతిభ కనబర్చినందుకు భవిష్యత్తులో లక్ష్మి తన ప్రతిభతో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్టు  దత్తాత్రేయ ఒక ప్రకటనలో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.