Read News in Telugu Language
adsdaksha

కోటి వృక్షార్చన లో మొక్కలు నాటిన మంత్రులు.. అర్బన్ ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ప్రారంభం..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఆగస్ట్ 26

సందర్శకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్న వింతలు, విశేషాలు..

కోటి వృక్షార్చన ( koti vruksharchana ) కార్యక్రమంలో భాగంగా శనివారం మంచిరేవుల ( manchirevula ) లో ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ( forest trek park ) ను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ప్రారంభించి మొక్కలు నాటారు. ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ( forest development corporation ) రంగారెడ్డి జిల్లా చిల్కూర్ ఫారెస్ట్ బ్లాక్ ( chilkuru forest block ) పరిధిలో మంచిరేవులలో రూ. 7.38 కోట్ల వ్య‌యంతో 256 ఎక‌రాల వీస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ను అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, భూగర్భ గనుల, సమాచార శాఖ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సఫారీ వాహనంలో పార్కు అంతా కలియ తిరిగారు.

 

అర్బ‌న్ లంగ్ స్పేస్ లో భాగంగా మానసిక ఉల్లాసం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు సరికొత్త థీమ్‌తో అభివృద్ధి చేసిన ఈ పార్క్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గండిపేట, కోకాపేట, మంచిరేవుల పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ( hyderabad ) మహానగర ఆకాశ హర్మాలను వీక్షించేలా ఏర్పాటు చేసిన వాచ్ టవర్ ( watch tower ) ఈ పార్క్ లో అదనపు ఆకర్షణగా నిలువ‌నున్నట్లు వెల్లడించారు. ఈ పార్కులో గ‌జీబో, వాకింగ్ ట్రాక్, ట్రెక్కింగ్, రాక్ పెయింటింగ్, ఓపెన్ జిమ్, అంఫి థియేటర్, వాటర్ ఫాల్, త‌దిత‌ర‌ స‌దుపాయాలు క‌ల్పించామన్నారు.

పార్క్ ప్రత్యేకతలు :

విస్తీర్ణం: 256 ఎకరాలు.
వ్యయం: రూ. 7.38 కోట్లు
. పొడవు: 5.6 కి. మీ.
మొక్కలు: 50 వేల రకాలు
. ట్రెక్కింగ్ ట్రాక్: 2 కి. మీ.
వాకింగ్ ట్రాక్: 4 కి. మీ.

109 అర్బన్ ఫారెస్ట్ పార్కులకు గాను ఇప్పటివరకు 73 పార్కులు అందుబాటులోకి వచ్చాయి. 74 వ పార్కును నేడు ప్రారంభించారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలం చిల్కూరు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లో 256 ఎకరాల విస్తీర్ణంలో ఫారెస్ట్ ట్రెక్ పార్కును తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది.
గతంలో ఈ ప్రాంతాన్ని భవన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలకు డంపింగ్ గ్రౌండ్‌గా ఉపయోగించారు. పశువుల మేతకు వనరుగా వాడుకున్నారు. జీవసంబంధమైన ఒత్తిడితో ఈ నేల తన స్వాభావిక గుణాన్ని కోల్పోయి తీవ్రమైన కలుపు సమస్యను ఎదుర్కొన్నది. ఈ ప్రాంత భౌగోళిక స్వరూపం ట్రెక్కింగ్ కు అనుకూలంగా ఉండటంతో ‘అర్బన్ ఫారెస్ట్ పార్క్’ కాన్సెప్ట్ ద్వారా ఈ ప్రాంతాన్ని ట్రెక్కింగ్ కు అనుకూలంగా తీర్చిదిద్దారు.

read also : అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ తిరుపతి మన్యంకొండ ..

అటవీ సంరక్షణ, పునరుజ్జీవన కార్యక్రమాలు:

Hospital

హెచ్ఎండిఎ, అటవీ శాఖ కలిసి 5.6 కి.మీ చుట్టుకొలతతో దాదాపు 4.5 కి.మీ గోడను నిర్మించాయి. నిర్మాణ వ్యర్థాలను తొలగించి, ఖాళీ ప్రదేశాల్లో సుమారు 50,000 స్థానిక జాతుల మొక్కలు నాటారు. దాదాపు 25,000 పొద జాతులను గట్లుగా నాటారు.
ప్రస్తుతం ఉన్న చెట్ల పెంపకం పునరుజ్జీవన పనులను ప్రత్యేకంగా చేపట్టనున్నారు
. మొక్కలు నాటిన ప్రదేశాలలో సవాలుగా మారిన కలుపును తొలగిచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. నీటి అవసరాల కోసం మూడు జలాశాయాలను అభివృద్ధి చేశారు. ఈ ప్రాంతంలో నిర్మించిన రాతి డ్యామ్ లు నేల, నీటి సంరక్షణతో పాటు అటవీ పునరుజ్జీవనానికి తోడ్పడతాయి.

 

సందర్శకుల కోసం సౌకర్యాలు :

1). తాగునీటి ప్లాంట్
2). 4 ట్రెక్కింగ్ మార్గాలు సుమారు 2 కి.మీ.
3). దాదాపు 4 కి.మీ వరకు నడిచే మార్గాలు
4). టాయిలెట్ బ్లాక్
5). గార్డెన్ లో 2 బిల్డింగ్ లు
6). వాచ్ టవర్
7). టికెట్ కౌంటర్, గేట్‌తో కూడిన ఎంట్రీ ప్లాజా
8). 8 ఆకారంలో వాకింగ్ ట్రాక్
9). ఓపెన్ జిమ్
10). యాంఫిథియేటర్
11). జలపాతం
12). 3 చోట్ల రచ్చ బండలు
13). సంకేతాలు
14). స్థానిక దేవతల గుడులు
15). కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేశారు.

మొత్తం పెట్టుబడి రూ.7.38 కోట్లు۔

వివరాలు..
1. టిఎస్ ఎఫ్ డిసి సౌకర్యాల అభివృద్ధి, తోటల పెంపకం, అటవీ పునరుజ్జీవన పనుల కోసం రూ. 1.78 కోట్లను వెచ్చించింది.
2. హెచ్‌ఎండీఏ రక్షణ గోడల నిర్మాణానికి రూ.3.50 కోట్లను ఖర్చు చేసింది.
3. అటవీ శాఖ రక్షణ గోడల నిర్మాణానికి రూ.1.20 కోట్లను ఖర్చు చేసింది.
4. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సబిలిటి (సిఎస్ఆర్) కింద హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మొక్కలు నాటడానికి రూ.89.65 లక్షలు వెచ్చించింది.

 

read also : greece : గ్రీస్ లో నలభై ఏళ్ళ తర్వాత భారత ప్రధాని పర్యటన..

ఫలితాలు..

11 మంది సభ్యులకు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ప్రత్యక్ష ఉపాధి లభించింది.
• సుమారు రూ. 3 లక్షల నెలవారీ ఆదాయం సమకూరుతున్నది
• ట్రెక్కింగ్ అవకాశం ఉండటంతో పార్కు పెద్ద సంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తున్నది. కార్తీక మాసంలో అనధికారికంగా ఈ పార్కును తెరిచారు. ఆదివారాల్లో దాదాపు 2000 మంది సందర్శకులు ఈ పార్కుకు వస్తున్నారు.
• రాళ్లపై జంతువుల పెయింటింగ్‌తో పాటు ప్రత్యేకంగా బ్యాలెన్సింగ్ రాక్స్, బేబీ ఎలిఫెంట్, డేగ ముఖం, వృద్ధ సన్యాసి మొదలైన అందమైన రాతి నిర్మాణాలు యువత, పిల్లలను ఆకర్షిస్తున్నాయి.
• ఈ మార్గాలను కలుపుతూ ఉద్యానవనం, ట్రెక్ మార్గాల్లో అభివృద్ధి చేయబడిన వాకింగ్ ట్రాక్‌లకు చిన్న చిన్న కొండలు, తరంగాల స్వరూపంతో కూడిన భూభాగం మరింత ఆకర్షణను కలిగిస్తున్నది.
• పార్కులో అభివృద్ధి చేసిన చిన్న చెరువు, పెద్దమ్మ చెరువు, చెక్ డ్యాం ఈ ప్రాంతాన్ని మరింత సుందరంగా మారుస్తున్నాయి.
• దక్కన్ పీఠభూమికి ప్రత్యేకమైన ఉష్ణమండల డ్రై స్క్రబ్ ఫారెస్ట్ ను సంరక్షించడంతో పాటు మరింతగా పునరుజ్జీవింపచేసేందుకు అభివృద్ధి చేస్తున్నారు.
• మెలికలు తిరుగుతూ, పచ్చదనంతో అలరారుతున్న ఈ ప్రాంతం ప్రస్తుతం ఈ ప్రాంతం ట్రెక్కర్స్ కు స్వర్గధామంగా రూపాంతరం చెందింది.
• బొటానికల్ గార్డెన్, కెబిఆర్ నేషనల్ పార్క్ తర్వాత ఇది అత్యంత ప్రసిద్ధ చెంది అర్బన్ ఫారెస్ట్ పార్క్ గా రూపుదిద్దుకుంది.

read also : panchangamu: పంచాంగము.. నేటి రాశీఫలాలు..

ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, సీఎస్ శాంతికుమారి, అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జెడ్పీ ఛైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.