Read News in Telugu Language
adsdaksha

రేవంత్ రెడ్డికి బిగ్ షాక్..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 10

కేసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్..

రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి ( revanth reddy ) ప్రధాన అనుచరుడు టీపీసీసీ ( tpcc) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ ( kotori manavatharoy ) శుక్రవారం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసిఆర్( kcr ) సమక్షంలో బిఆర్ఎస్ ( brs ) లో చేరారు. సత్తుపల్లి ( sattupalli ) అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఓయూ ఉద్యమ నేత రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ ( jac ) చైర్మన్ మానవతారాయ్ ని కేటీఆర్ (ktr), సీఎం కేసీఆర్ ( cm kcr ) వద్దకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ( mp vaddiraju ravichandra ) తీసుకెళ్లారు. దాంతో వారు మానవతారాయ్ కి గులాబీ కండువా కప్పి ఆయన భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. మానవతారాయ్ తో పాటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి పిసిసి ఉపాధ్యక్షుడు సంభాని చంద్రశేఖర్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి కృష్ణ, సీనియర్ రాజకీయ నేత ఊకె అబ్బయ్య దంపతులు, డాక్టర్ రామచంద్రు నాయక్ బిఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు.

Hospital

read also : కదం తొక్కిన యువం సైన్యం..

ఉద్యమకారుల కడుపు చూసి అన్నం పెట్టి ఉద్యమకారులకు చట్టసభల్లో అవకాశాలు కల్పించే కెసిఆర్ తప్పక మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని, ఉద్యమకారులకు టికెట్ ఇవ్వకుండా విద్యార్థి ఉద్యమకారుల జేబులు చూసే కాంగ్రెస్ పార్టీ కి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు. బిఆర్ఎస్ లో తన చేరికకు సహకరించిన రాజ్యసభ ఎంపీ బండి పార్థసారధి రెడ్డి కి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు, ఎంపీ నామా నాగేశ్వరరావు కు టిఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతామధుకు మానవుతారాయ్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.