Read News in Telugu Language
adsdaksha

కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన కేసిఆర్..

దక్ష న్యూస్, హైదరాబాద్: అక్టోబర్ 30

దుబ్బాక ( dubbaka ) నియోజకవర్గంలో సోమవారం హత్యా యత్నానికి గురై సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ ( yashoda hospetal ) లో చికిత్స పొందుతున్న మెదక్ ఎంపీ, దుబ్బాక బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ( kotta prabhakar reddy ) ని సీఎం కేసీఆర్ ( cm kcr ) సోమవారం రాత్రి పరామర్శించారు. ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎప్పటికప్పుడు ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్య , ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ( harish rao ) ను సీఎం ఆదేశించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ధైర్యం ఉండాలని సూచించారు.

Hospital

ఆందోళన చెందవద్దని ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. హత్యా యత్నం సంఘటన దురదృష్ట కరమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు . సంఘటన పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు . ఎన్నికల సభలను ముగించుకుని హెలికాఫ్టర్ లో సోమవారం సాయంత్రం బేగం పేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ముఖ్యమంత్రి హుటాహుటిన యశోద హాస్పిటల్ కు వెళ్లాలని భావించారు. అయితే ప్రభాకర్ రెడ్డి కి ఆపరేషన్ జరుగుతున్నదని ఇంకా రెండు , మూడు గంటలు సమయం పడుతుందని సమాచారం అందడంతో ముఖ్యమంత్రి 8 గంటల ప్రాంతంలో హాస్పిటల్ కు చేరుకుని ప్రభాకర్ రెడ్డి ని పరామర్శించారు.

హాస్పిటల్ కు భారీ సంఖ్యలో తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు కూడా ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. కేసీఆర్ వెంట మంత్రులు తన్నీరు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ మధుసూదనా చారి తదితరులు ఉన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.