Read News in Telugu Language
adsdaksha

ప్రజా ఆశీస్సులు, దీవెనలు ఉన్నవారికే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ..

- రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ దే అధికారం..

– కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి కాంగ్రెస్ లోకి భారీ చేరికలు

 

– తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి..

దక్ష న్యూస్, కొత్తగూడెం : ఆగస్ట్ 21

బీఆర్ఎస్ జాబితా లాగా కాంగ్రెస్ ( congress) పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఉండదని తెలంగాణ ( telangana ) కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( ponguleti srinivas reddy ) అన్నారు. ప్రజా ఆశీస్సులు, దీవెనలు ఉన్నవారిని పరిగణలోకి తీసుకుని, అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తుందని తెలిపారు. సోమవారం కొత్తగూడెం ( kottagudem) క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తలు, నాయకుల సమావేశం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికలు ఎప్పుడొస్తాయా… కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడెప్పుడు ఓటు వేయాలని యావత్తు తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.

Hospital

కేసీఆర్ ( kcr) డిమాండ్ చేశాడనో, ఆయన దీక్ష చేశాడనో తెలంగాణ ను సోనియమ్మ ఇవ్వలేదని పొంగులేటి అన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించి… వారి ఆత్మగౌరవాన్ని అగౌరవపరచొద్దనే సద్దుదేశ్యంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియమ్మ ఇచ్చారన్నారు. తెలంగాణలో అధికారం కోల్పొతామని తెలిసినా… ఆంధ్రప్రదేశ్లో ఉనికి చాటుకోలేమని తెలిసినా ప్రజల ఆశ, ఆకాంక్షను పరిగణలోకి తీసుకుని తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియమ్మదని పేర్కొన్నారు.

read also : నిరుద్యోగి నూతన హోటల్ ప్రారంభించిన మానవతారాయ్ ..

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రైతు రుణమాఫీ, దళిత బంధు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇలా ఎన్నో వాగ్ధానాలను నేరవేర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని పొంగులేటి దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక ఇళ్లు లేని ప్రతి పేదవానికి రూ. 5లక్షల విలువ చేసే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రతి మెనిఫెస్టోను ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చాక చిత్తశుద్ధితో అమలు పరుస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం ఏరియాలోని 6,7,8,9,10,11,12 మొత్తంగా ఏడు వార్డులకు చెందిన బీఆర్ఎస్ సహా ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పొంగులేటితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఉకంటి గోపాలరావు, తూము చౌదరి, ఆళ్ల మురళి, నాగేంద్ర త్రివేది, నాగ సీతారాములు, యర్రం శెట్టి ముత్తయ్య, శివారెడ్డి, మోహన్ రావు, ఆకునూరి కనకరాజు, రామలక్ష్మణ్, రామనాథం, భద్రయ్య, చింతలపూడి శేఖర్, సర్పంచులు శేఖర్, లాలు, శ్రీను, శంకర్, లక్కినేని సాయి, కల్లూరి కుమార్, సమ్మయ్య, మోహన్, స్వప్న, రాజశేఖర్, పాషా, సుమ, బోయిన విజయ్, బాణోత్ కుమార్, బాలు, మూడు మోహన్, కమ్మ, సత్తి, వశ్యాబాణత్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.