Read News in Telugu Language
adsdaksha

నిరుద్యోగి నూతన హోటల్ ప్రారంభించిన మానవతారాయ్ ..

దక్ష న్యూస్, సత్తుపల్లి : ఆగష్టు 21

నిరుద్యోగులు ఒకరి మీద ఆధారపడకుండా పోటీ పరీక్షలకు చదువుతూ సొంత కాళ్లపై నిలబడేలా వ్యాపారాలు చేయాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ ( koturi manavatharoy ) అన్నారు. పెనుబల్లి ( penuballi ) మండలం కొండ్రుపాడు కు చెందిన నిరుద్యోగి తేళ్లూరి సతీష్ కి చెందిన పెనుబల్లి మండలం విఎం బంజర్ ( v. m. banjar ) మెయిన్ సెంటర్ కొత్తగూడెం రోడ్ లో ఏర్పాటు చేసిన నూతన హోటల్ అంబూరి టిఫిన్ సెంటర్, కర్రీ పాయింట్ ను సోమవారం ఉదయం మానవతా రాయ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

read also : మద్యం దుకాణాలకు 1,31,490 దరఖాస్తులు..

Hospital

ఈ సందర్భంగా మానవతారాయ్ మాట్లాడుతూ నిరుద్యోగులు ఒకరి మీద ఆధారపడకుండా పోటీ పరీక్షలకు చదువుతూ సొంత కాళ్లపై నిలబడేలా వ్యాపారాలు చేయాలన్నారు. వ్యాపార రంగంలో నిలదొక్కుకుంటే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగి కన్నా ఎక్కువగా సంపాదించవచ్చని సూచించారు. నిరుద్యోగులు ఒక వయసు వచ్చాక తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా తేళ్లూరి సతీష్ ను ఆదర్శంగా తీసుకొని సతీష్ లాగా స్వయం ఉపాధి పొందాలన్నారు. హోటల్ ప్రారంభించినందుకు సంతోషంగా ఉందంటూ మానవతారాయ్ ని తేళ్లూరి సతీష్ శాలువాతో సన్మానించారు.

read also : రాజీవ్ గాంధీ స్పూర్తితో యువత దేశ రక్షణలో ముందుకు సాగాలి ..

ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సెక్రెటరీ రావి నాగేశ్వరరావు,సత్తుపల్లి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దేశి రెడ్డి సత్యనారాయణ రెడ్డి, సత్తుపల్లి మాజీ ఎంపీటీసీ ఐ కృష్ణ,పసల ఏడుకొండలు, వెలిశాల నాగేంద్ర చారి, వెల్లంపల్లి ఏడుకొండలు, గుర్రాల దేవ ప్రియుడు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.