Read News in Telugu Language
adsdaksha

కాంగ్రెస్ టికెట్ కై తొలి దరఖాస్తు సమర్పించిన మానవతారాయ్..

దక్ష న్యూస్, హైదరాబాద్ ఆగస్ట్ 18

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజక వర్గం ( sattupalli constituency ) కాంగ్రెస్ టికెట్ కోసం శుక్రవారం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ ( koturi manavatharoy ) హైదరాబాద్ గాంధీ భవన్ లో దరఖాస్తు ఫారాలను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ( congress party ) అసెంబ్లీ నియోజకవర్గాల ఆశావహ అభ్యర్థులకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్,ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మరో ఏఐసిసి కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి లు దరఖాస్తు ఫారాలను విడుదల చేశారు. తొలి దరఖాస్తు ఫారాన్ని అందుకున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ దరఖాస్తును పూరించి దరఖాస్తులో ఉన్న హామీ పత్రాలపై సంతకం పెట్టి, పార్టీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు నిర్దేశించిన 25 వేల రూపాయల డిడి ని దరఖాస్తు ఫారం తో జత చేసి సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గం క్రమ సంఖ్య 116కు దరఖాస్తు చేసుకొన్నారు.

read also : శ్రావణ శుక్రవారం షర్మిల వినూత్న నిరసన..

Hospital

దరఖాస్తు ఫారాన్ని మానవతారాయ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు అందించారు.119 నియోజకవర్గాల్లో తొలి దరఖాస్తును సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గంకు మానవతారాయ్ దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు సమర్పించేటప్పుడు మానవతరాయ్ వెంట సత్తుపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు ఐఎన్టీయూసీ సెంటర్ కౌన్సిల్ సెక్రెటరీ రావి నాగేశ్వరావు చౌదరి,సత్తుపల్లి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దేశి రెడ్డి సత్యనారాయణ రెడ్డిలు, ఓయూ జేఏసీ నేతలు కొప్పుల ప్రతాపరెడ్డి, బైరి నాగరాజ్ గౌడ్,బిక్షపతి నాయక్ లు ఉన్నారు.

ఈ సందర్భంగా సత్తుపల్లి కి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రావి నాగేశ్వరరావు చౌదరి, దేశి రెడ్డి సత్యనారాయణ రెడ్డి లు గాంధీభవన్ లో ఉన్న టీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ( revanth reddy ) ని శాలువాతో సన్మానించారు. సత్తుపల్లి నియోజకవర్గ పర్యటనకు రావాలని వారు రేవంత్ రెడ్డిని కోరారు. రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

read also : దుమ్ముగూడెం విద్యార్థినికి హర్యానా గవర్నర్ ప్రశంసలు..రాజ్ భవన్ కి రావాల్సిందిగా ఆహ్వానం..

Leave A Reply

Your email address will not be published.