Read News in Telugu Language
adsdaksha

పెద్దమ్మతల్లి దేవాలయంలో కొత్వాల ప్రత్యేక పూజలు..

దక్ష న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం : జనవరి 29

ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కేంద్ర సహకార మార్కెటింగ్ సొసైటీ ( dcms ) చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు ( kotvala srinivasarao ) సోమవారం పాల్వంచ మండల పరిధిలోని జగన్నాధపురం పెద్దమ్మతల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కొత్వాలకు పెద్దమ్మతల్లి దేవాలయం ధర్మకర్తలు, పాల్వంచ మండల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

Hospital

Read also: వచ్చే నెలలోనే మెగా ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవం..

కొత్వాలను శాలువా, బొకేలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్దమ్మగుడి డైరెక్టర్లు ఎస్వీఆర్ కే ఆచార్యులు, గంధం వెంగళరావు, కిలారు నాగమల్లేశ్వరరావు, డీసీఎంఎస్ డైరెక్టర్ పరుచూరి రవికుమార్, మాజీ జడ్పీటీసీ సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, నందా నాయక్, సర్పంచ్ బానోత్ అనిత, కాంగ్రెస్ నాయకులు కోండం పుల్లయ్య, వీసంశెట్టి శ్రీను, బాదర్ల జోషి, గంధం నర్సింహారావు, కందుకూరి రాము, గంధం సతీష్, బానోత్ బాలాజీ, దయాకర్ రెడ్డి, కృష్ణ రెడ్డి, అంబికా రెడ్డి, కొము చారి, బ్రహ్మ చారి, రామా, ఉప సర్పంచ్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.