Read News in Telugu Language
adsdaksha

ఖర్గే హైదరాబాద్ పర్యటనను జయప్రదం చేయాలి : డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల

దక్ష న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జనవరి 24

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే గురువారం హైదరాబాద్ రానున్న సందర్భంగా జరగనున్న పోలింగ్ బూత్ స్థాయి సమావేశంలో కార్యకర్తలందరు పాల్గొని జయప్రదం చేయాలనీ డిసిఎంఎస్ వైస్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు( kotvala srinivasrao ) అన్నారు. బుధవారం పాల్వంచ లోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

read also : పగడాలు, ముత్యాలు ఖమ్మం నగరంలో అనేకమంది ఉన్నారు.. సెకెండ్ ఫేజ్ ఐటీ హబ్ కి గుంతలు తవ్వి వదిలేశారు..

Hospital

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు గత అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలంగా పనిచేసి, పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలు హాజరుకావాలన్నారు. ఈ సమావేశంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారని కొత్వాల తెలిపారు.

read also : మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది..

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసి సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జాలే జానకిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు, నాయకులు బద్ది కిషోర్, అయితా గంగాధర్, బాలినేని నాగేశ్వరరావు, బత్తుల వెంకటేశ్వరావు, భట్టు మురళి, బాదార్ల జోషి, SK చాంద్ పాషా, సూర్య కిరణ్, వజ్జల రాము, గంధం నర్సింహారావు, సామా జనార్ధన రెడ్డి, కొమ్మరాజు విజయ్, వీరు, అజ్మీరా రమేష్, గండు భరత్, పెటేటి నరేష్, కట్టా సోమయ్య, నాగిరెడ్డి, సామా వెంకటరెడ్డి, ముసలయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.