Read News in Telugu Language
adsdaksha

రాముడైనా కృష్ణుడైనా ఆయనే..

దక్ష న్యూస్, ఖమ్మం సెప్టెంబర్ 30

చరిత్రలో ఎన్టీఆర్ స్థానం అజరామరం..

నాకు ఆయన పేరు ఉండడం అదృష్టం..

ఖమ్మం పర్యటనలో మంత్రి కేటిఆర్..

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో ఆప్తుడు విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు ( nandamuri tharaka ramarao ) అని మంత్రి కేటిఆర్ అన్నారు. శనివారం ఖమ్మం ( khammam ) జిల్లాలో పర్యటించిన కేటిఆర్ ( ktr ) మంత్రి  అజయ్ కుమార్, ఎంపీ నామా, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రలతో కలిసి ఖమ్మం లకారం టాంక్ బండ్ పై రూ.1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన NTR పార్క్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాముడు ఎలా ఉంటాడో తెలీదు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలీదు మాకు రాముడైన, కృష్ణుడైన ఆయనే అన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం కల్పించిన మంత్రి పువ్వాడ కు ధన్యవాదాలు తెలిపారు.

Hospital

దక్షిణ భారత దేశంలో హ్యాట్రిక్ ఎవరు కొట్టలేదని, అది సీఎం కెసీఆర్ కే సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

అనంతరం రూ.10 కోట్లతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్(యు జి సి) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
2.49 కోట్లతో నిర్మించనున్న అమృత్ 2.0 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్(యు జి డి) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

20వ డివిజన్ లోని ఎస్బిఐటి (SBIT) ఇంజనీరింగ్ కళాశాల రోడ్ లో మున్సిపల్ కార్పొరేషన్ అధ్వర్యంలో రూ.71 లక్షలతో నిర్మించిన స్పోర్ట్స్ పార్క్ (Turf కోర్టు)ను ప్రారంభించారు.

కార్యక్రమంలో ఎంపీ బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, కలెక్టర్ వి.పి. గౌతమ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, AMC చైర్మన్ దోరేపల్లి శ్వేత, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.