Read News in Telugu Language
adsdaksha

మున్సిపల్ శాఖపై కేటిఆర్ ఫైర్.. సిగ్గుండాలి అంటూ ఆగ్రహం..

దక్ష న్యూస్, నల్గొండ : ఏప్రిల్ 4

నల్గొండ జిల్లా నందికొండ వాటర్ ట్యాంక్‌లో కోతుల మృతదేహాలు లభ్యం కావడంపై మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి ( brs ) పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ( ktr ) స్పందించారు. మున్సిపల్ శాఖ సిగ్గుపడాల్సిన విషయమని విమర్శించారు. తాగునీటి ట్యాంకుల నిర్వహణలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ‘ఈ ప్రభుత్వం.. ప్రజారోగ్యం కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోంది. కాంగ్రెస్ ( congress ) పాలన అస్తవ్యస్తంగా మారింది’ అంటూ ‘ఎక్స్’ ( x ) లోను పోస్ట్ చేశారు.

read also : పువ్వాడ ఉదయ నగర్ సర్వే నెంబర్ 192 లో భూదందాలు : డాక్టర్ కె.వి. కృష్ణారావు..

Hospital

నందికొండ ( nandikonda ) వాటర్ ట్యాంక్ లో కోతులు పడి మృతి చెందిన ఘటన చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఎన్ ఇ ఎస్ పి ఐ ( nespi ) నీటి సరఫరా విభాగం సుమారు రెండు వందల నివాసలకు తాగునీటి కోసం ట్యాంక్‌ను నిర్మించింది. దాహం తీర్చుకునేందుకు ఈ ట్యాంకు వద్దకు వచ్చిన కోతులు అందులోకి దిగాయి. బయటకు వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో మృతి చెందాయి. బుధవారం ట్యాంకు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు. దాదాపు 30 కోతుల కళేబరాలను బయటకు తీశారు.

read also : యాదాద్రిలో భక్తులకు సౌకర్యాల కల్పన ..హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు..

ఈ విషయంపై స్పందించిన మాజీ మంత్రి కేటిఆర్ మున్సిపల్ శాఖ నిర్లక్ష్యానికి ఫైర్ అయ్యారు. నిర్వహణ లోపం వల్లే ఆ నీటిని అలాగే సరఫరా చేశారని ఇది ఆ శాఖ సిగ్గుపడాల్సిన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజారోగ్యం కంటే రాజకీయాలే ఎక్కువయ్యాయని కాంగ్రెస్ పాలనలో పాలన అస్తవ్యస్తంగా తయారయిందని అసహనం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.