Read News in Telugu Language
adsdaksha

ఎంపీ బరిలో కుమారస్వామి .. మండ్యా లోక్‌సభ నుంచి పోటీ ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 26

జేడీఎస్‌ నేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. తాను మండ్య పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. బీజేపీ ( bjp ) తో పొత్తులో భాగంగా మాండ్య, కోలార్, హాసన్ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని కుమారస్వామి ( kumaraswami ) స్పష్టం చేశారు. కోలార్ ( kolar ) అభ్యర్థిగా మల్లేష్ బాబును ఆయన ప్రకటించారు. మాండ్యా ప్రజల ఒత్తిడి వల్లే మండ్య నుంచి పోటీ చేయాల్సి వచ్చిందని కుమారస్వామి అన్నారు.

read also : తెలంగాణ పరువు తీసినవ్ : ఎమ్మెల్సీ కవితపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు..

Hospital

2019 లోక్‌సభ ఎన్నికల్లో కుమారస్వామి కుమారుడు నిఖిల్‌పై స్వతంత్ర అభ్యర్థి సుమలత అంబరీష్ మాండ్య పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మరి ఆమె వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం చన్నపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీతో కుదిరిన సీట్ల పంపకంలో జేడీ(ఎస్) మూడు స్థానాల్లో, బీజేపీ 25 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.

read also : 14సీట్లు పక్కా రావాలి : కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి..

సిట్టింగ్ ఎంపీ, మాజీ మంత్రి హెచ్చి రేవణ్ణ తనయుడు ప్రజ్వల్ రేవణ్ణ పేరును హసన్‌లో ప్రకటిస్తారని భావించగా, బీజేపీ నేతలు ఆయనను వ్యతిరేకించడంతో గందరగోళం నెలకొంది. 28 ఎంపీ స్థానాలున్న కర్ణాటకలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 26, మే 7 తేదీల్లో పోలింగ్ జరగనుంది.

Leave A Reply

Your email address will not be published.