Read News in Telugu Language
adsdaksha

చంద్రయాన్‌-3 మిషన్‌లో సాఫ్ట్‌వేర్‌ రూపొందించింది తెలుగు యువకుడే ..

తల్లిదండ్రులు కూలీలు.. చదివింది ప్రభుత్వ పాఠశాలలో..

చంద్రయాన్ – 3 సక్సెస్ తో భారతదేశం ఎంతో గర్వించదగ్గ చంద్రయాన్‌-3 (chandrayaan – 3 ) శాస్త్రవేత్తల బృందంలో తెలుగు యువకుడి కృషి ఉండడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు గర్వకారణం అయింది. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి గ్రామవాసి ఇస్రో లో కీలకంగా పని చేస్తున్నారు.

 

ఉండవెల్లికి చెందిన కుమ్మరి మద్దిలేటి, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు కుమ్మరి కృష్ణ (kummari krishna ) 2018 లో ఐసీఆర్‌బీ ( icrb ) నిర్వహించిన పరీక్షలలో 4వ ర్యాంక్‌ సాధించి బెంగళూర్‌ ( bengaluru ) లో ఇస్రో ( isro ) లివోస్‌ విభాగంలో గ్రూప్‌-ఏ గెజిటేడ్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టారు.

 

Hospital

కృష్ణ సాఫ్ట్ట్‌వేర్‌ సైంటిస్ట్‌ ఎస్‌డీ చంద్రయాన్‌-3 మిషన్‌లో 2 పెలోడ్స్‌ ఎల్‌ఎచ్‌వీసీ ( lhvc), ఐఎల్‌ఎస్‌ఏ( ilsa) కు డేటా ప్రాసెసింగ్‌ సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. ఈ సాఫ్ట్‌వేర్‌తో చంద్రుడిపై వచ్చే భూకంపాలు కెమోరాలో రికార్డు చేయడంతోపాటు పెలోడ్స్‌ నుంచి వచ్చే డేటాను ఐఎస్‌ఆర్‌ఏపీ, బెంగళూర్‌ గ్రౌండ్‌ స్టేషన్‌ రిసీవ్‌ చేసుకునేలా రూపకల్పన చేసినట్లు వివరించారు.

read also : జయహో .. భారత్.. వెల్లువెత్తిన అభినందనలు..వాడ వాడలా సంబరాలు..

కృష్ణ తల్లిదండ్రులు రోజు వారి కూలీలు. కృష్ణ ఉండవెల్లి ప్రభుత్వ పాఠశాలలో హైస్కూల్‌ విద్య వరకు చదివారు, తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో డిప్లొమా, హైదరాబాద్‌ వాసవీ ఇంజినీరింగ్‌ కాలేజీలో టెక్నికల్ విద్య పూర్తి చేసి తర్వాత ఇస్రోలో ఉద్యోగం సాధించారు. చంద్రయాన్ -3 విజయవంతం కావడంతో మన తెలుగు వాడి కృషి, నైపుణ్యం వెలుగులోకి వచ్చాయి.

Leave A Reply

Your email address will not be published.