Read News in Telugu Language
adsdaksha

బీజేపీకి తెలంగాణలో స్థానం ఉండకూడదంటే బీఆర్‌ఎస్ బతకాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని..

దక్ష న్యూస్, గోదావరి ఖని : జూన్ 1

తప్పుడు పద్దతుల్లో మత విద్వేశాలు రెచ్చగొడుతున్న బీజేపీ దేశ అభివృద్ధిలో పూర్తిగా విఫలం అయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ( kunamneni sambashivarao ) విమర్శించారు. బీజేపీ రాజ్యాంగానికి భిన్నంగా వ్యవహరిస్తోందని, బీజేపీకి తెలంగాణలో స్థానం ఉండకూడదంటే బీఆర్‌ఎస్ బతకాలని అభిప్రాయపడ్డారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ( godavarikhani ) లోని ఇల్లందు గెస్ట్ హౌజ్‌లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఏ రంగమూ సంతృప్తిగా లేదని, కొత్త తెలంగాణ పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.

read also : తెలంగాణ ప్రజలకు దశాబ్ది వేడుకల శుభాకాంక్షలు : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..

Hospital

తెలంగాణలో ఏ రంగమూ సంతృప్తిగా లేదని ..సింగరేణిలో రూ.వేల కోట్ల కుంభకోణం
జరిగిందన్నారు. కేసీఆర్ ఓడిపోయి అదృష్టవంతుడయ్యిండని, వీరి పాపాలు కాంగ్రెస్ మోస్తోందన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమా..? పేద రాష్ట్రమా..? అనేది అర్థం కావట్లేదని సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రజా సమస్యలపై మా నిరంతర పోరాటం ఆగదన్నారు. తెలంగాణ గీతంపై, రాష్ట్ర చిహ్నంపై బీఆర్ఎస్ తీరు ఆక్షేపనీయమని, ఇలాంటి వాటిపై కాకుండా ప్రజా సమ్యసలపై దృష్టిపెట్టాలని సూచించారు.

read also : పాలేరు నా సొంత ఇల్లు.. మూడేళ్ళలోనే అర్హులందరికీ సంక్షేమ పథకాలు..

కాంగ్రెస్ గెలుపు కమ్యూనిస్టుల ద్వారానే సాధ్యమని, డబ్బులతో పని లేని ఎన్నికల కోసం పోరాటాలు చేస్తామన్నారు. ప్రజల కోసం పుట్టిందే కమ్యూనిస్టు పార్టీ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సింగరేణి మాజీ సీఎండీ శ్రీధర్ రూ.వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని, సింగరేణి పదేళ్ల కుంభకోణాలపై విచారణ చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. విద్యుత్ రంగం, ఇరిగేషన్ రంగంలోనూ ఘోర వైఫల్యాలు ఉన్నాయని, ఉద్యోగ కల్పన, రైతాంగం, వ్యవసాయం, అభివృద్ధిపై ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.