Read News in Telugu Language
adsdaksha

కూనంనేని లాంటి నేతలు తోడుంటే కొత్తగూడెం అభివృద్ధి బాట పట్టిస్తా ..

దక్ష న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నవంబర్ 21

జర్నలిస్ట్ గా ప్రస్థానం మొదలు పెట్టి శాసన సభ లో అడుగు పెట్టిన
నీతి వంతమైన నేత చట్ట సభల్లో ఉండాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( tummala nageswararao ) అన్నారు. మంగళవారం కాంగ్రెస్ ( congress ) పార్టీ బలపరిచిన కొత్తగూడెం నియోజకవర్గ సీపీఐ ( cpi ) అభ్యర్థి కూనంనేని సాంబశివరావు( kunamneni sambashivarao ) విజయాన్ని ఆకాంక్షిస్తూ కొత్తగూడెం ( kottagudem ) పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్ లో కాంగ్రెస్, టిడిపి, సిపిఐ పార్టీల నాయకులు కలిసి ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivas reddy ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, కూనంనేని కి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉందని, కూనంనేని లాంటి నేతలు నాకు తోడుంటే కొత్తగూడెం అభివృద్ధి బాట పట్టిస్తా అన్నారు.

read also : ప్రాంతంలోని వాడు ద్రోహం చేస్తే పాతరేద్దాం.. ఉద్యమ కారులకు ప్రాధాన్యం ఇచ్చే కాంగ్రెస్ ను గెలిపిద్దాం..

Hospital

నలబై ఏళ్లు గా రాజకీయ సేవ చేసే అవకాశం తనకు ఎన్టీఆర్ ఇచ్చారని, నీటి పారుదల రంగం రహదారుల రంగం లో అభివృద్ధి అంటే ఏంటో చూపించా అని తుమ్మల అన్నారు. తొలి దశ తెలంగాణ ఉద్యమం లో కొత్తగూడెం లో చదివా
.. రైల్వే అండర్ బ్రిడ్జి, హాస్పిటల్….సుజాత నగర్ మండల కేంద్రం ఏర్పాటు చేశా
అన్నారు. సాంబశివరావు ను గెలిపిస్తే కొత్తగూడెం కార్పొరేషన్ గా మారుస్తాం
అని పేర్కొన్నారు. జాతీయ రహదారుల తో కొత్తగూడెం జిల్లాను ప్రగతి బాట పట్టించినట్లు తుమ్మల వెల్లడించారు. కొందరు మాఫీయా మాదిరి మారి జిల్లా కు తలవంపులు తెస్తున్నారన్నారు.

read also : పొంగులేటికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ మద్దతు..

జిల్లా కీర్తి ప్రతిష్టలు పెరిగేలా భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో రాజకీయం చేశానని తుమ్మల తెలిపారు. నేను పొంగులేటి మా జీవితాలు జిల్లా అభివృద్ధి కోసమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తో పాటు కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్, సిపిఐ, టిడిపి,పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.